సీనియర్ సినీ నటి జయంతి కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం అకస్మాత్తుగా శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది తలెత్తటంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. 1943 బళ్లారిలో పుట్టిన ఆమె పలు భాషల్లో నటించారు. 1980ల్లో కొండవీటిసింహంలో ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించారు. 1990లో పెదరాయుడు ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ చెల్లిగా.. మోహన్‌బాబు అత్తగా నటించారు. కొద్దికాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. ఆస్తమాతో బాదపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.