మెగా బ్రదర్స్ మనసు అభిమానులకు తెలిసిందే. ఎవరికి కష్టం వచ్చినా ముందుండే మానవత్వం వారి సొంతం. అన్నయ్య చిరంజీవి నడిచే బాటలోనే నాగబాబు, పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూనే ఉన్నారు. వారిని అనుసరిస్తూ అభిమానులు అదే చేస్తున్నారు. కొవిడ్19 పాజిటివ్ భారినపడిన నాగబాబు.. మొదట అన్న మాటలు.. కోలుకోగానే ప్లాస్మాదానం చేస్తానంటూ దైర్యంగా చెప్పారు. వైరస్ కు గురైన వారిలో సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని సూచించారు. అన్నట్టుగానే కోలుకోగానే.. ప్లాస్మాదానం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో తాజాగా నాలుగోసారి నాగబాబు ప్లాస్మాదానం చేశారు. తన బ్లడ్ గ్రూప్ అరుదైన AB Positive అని చెప్తూ ఎవరికి అవసరమైనా తనని సంప్రదించొచ్చన్నారు. విశ్వ మానవాళినే అల్లకల్లోలం చేసిన కరోనా నివారణకు టీకా అతి త్వరలోనే రానుందని చెప్పారు. ఈ టీకా రాగానే ప్రతి ఒక్కరూ ఆ కరోనా రక్షణకవచాన్ని స్వీకరించాల్సిందిగా సూచించారు. ఇప్పటికి వినవస్తున్న వార్తల్ని చూస్తే తొందర్లోనే టీకా అందుబాటులోకి వస్తోందన్నారు. అంతవరకూ కరోనా బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్త వహించాలని కోరారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడంలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. నాలుగోసారి ఫ్లాస్మాదానం చేస్తున్న నాగబాబు స్పూర్దిని మెగాభిమానులంతా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారని,
కొణిదెల నాగబాబు , ఆయన కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు వెల్లడించారు.



