ప్రముఖ గాయని సునీత, డిజిటల్ మీడియా అధినేత వీరపనేని రామ్ వివాహం డిసెంబరు 26న జరుగనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 27న పెళ్లి జరగాల్సి ఉండగా ఎందుకో వాయిదా వేశారు. సరైన ముహూర్తం లేకపోవటం వల్లనే ఇది జరిగినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ నెల 26న పెళ్లికి ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్లో పుకార్లు మొదలయ్యాయి. దీన్నుంచి సునీత, రామ్ల నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. 19 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకున్న సునీత.. ఆ తరువాత భర్తతో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత పలుమార్లు రెండోపెళ్లిపై గుసగుసలు వినిపించినా ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా రామ్ తో పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరుపుకోవటంతో రెండోపెళ్లిపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.



