ఆర్జీవీ దర్శకత్వంలో పవర్‌స్టార్ సినిమా. లక్ష్మీస్‌పార్వతీ తీసిన వర్మ ఇప్పుడు పవన్‌కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు. ఎన్నికల ఫలితాల తరువాత కథ అంటూ.. హింట్ ఇచ్చాడు. కేరక్టర్స్‌ను కూడా డూప్ ను మించేలా ఎంపిక చేశాడు. నిజంగానే వర్మ నటీనటుల ఎంపిక అద్భుతమంటూ మెచ్చుకోవాలి. వీరప్పన్ నంచి పవర్‌స్టార్ వరకూ జీవితకథలను తీసే వర్మ పాత్రలకు తగినట్టుగా నటీనటులను ఏరికోరి మరీ తీసుకొస్తాడు. వర్మలో దర్శకుడిని ప్రతిభను పవన్ అభిమానులూ బేష్ అంటున్నారు. పవర్‌స్టార్ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారనేది సస్పెన్స్. ఎందుకంటే.. ఇక్కడ పవన్‌ను మాత్రమే కాదు.. చిరంజీవిని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. అపుడెపుడో చిరుతో వజ్రాలదొంగ సినిమా తీయాలనుకుని.. కొంత మేర చిత్రీకరించిన తరువాత అర్ధాంతరంగా ఆగిపోయిందట. దానితాలూకూ అవమానం ఎక్కడో వర్మను వెంటాడుతున్నట్టుగా తరచూ ఆయన మాటల్లో తెలుస్తుంది. పవన్‌కళ్యాణ్‌ను ఎందుకింత లక్ష్యం చేసుకున్నాడనేందుకు బోలెడు కారణాలు. ఒకటి.. వైసీపీ అనుకూల వాదిగా వర్మకు ఆల్రెడీ ట్యాగ్ ఉంది. జగన్ పట్ల ఆయనకు ఉన్న ప్రేమాభిమానాలు కూడా తెలిసినవే. ఒకర్ని పైకి లేపాలంటే.. మరొకర్ని కిందకు నెట్టాలనే ఫార్ములానూ ఆచరించటంలో వర్మస్టయిల్ ఇలాగే ఉంటుంది. పొద్దునే లేవగానే పోర్న్ సైట్లు చూస్తాను.. రాత్రిళ్లు మందు కొడతాను.. ఇంకా ఏదనుకుంటే అదిచేస్తానంటూ బహిర్గతంగా చెప్పటం వర్మలోని పైశాచికత్వానికి ఉదాహరణ. ఇటువంటి వర్మ పవర్‌స్టార్‌ను చాలా హీనంగా చిత్రీకరించేప్రయత్నం చేస్తున్నాడు. దీనికోసం తన పైత్యం మొత్తం రంగరించాడు. నిజమే.. పవన్‌ను నిజంగానే ఏకిపారేయాలి. ఎందుకంటే.. ఎవరికీ హానిచేయని వ్యక్తికదా! ఎంతోమందికి కోట్లాదిరూపాయలు దానం చేసిన నటుడు కదా! ఆమాత్రం అతడి పరువు తీయాల్సిందే. ప్లాప్‌లు వచ్చినా కోట్లాది మంది అభిమానాన్ని దూరం చేసుకోలేని పవన్ చరిష్మాను దెబ్బతీయాలంటే అలా చేయాల్సిందే. ఇంతకీ.. పవన్ చేసిన తప్పేమిటీ.. సినీ, రాజకీయ రంగాల్లో
ఆయనంటే ఎందుకంత కడుపుమంట. తనకు తానుగా పోరాటం చేస్తూ.. కోట్లాదిమంది అభిమానుల మనసు గెలిచినందుకేనేమో! సినీ రంగంలో అంత ఇమేజ్ ఉన్నా.. అడ్డగోలు సినిమాలు చేయలేదు. సినీతారల్ని పక్కలోకి రమ్మని కోరలేదు. ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చాడు. కొత్త దర్శకులను పరిచయం చేసి నేనున్నా మీకంటూ ధైర్యాన్నిచ్చారు. వివాహజీవితంలో ఎదురైన ఇబ్బందులు భరించలేకనో.. రోజూ పోట్లాడుకుంటూ సంసారం చేయటం ఇష్టంలేకనో.. విడాకులిచ్చారు.
దానికీ ఆయన వివరణ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోలేదు.. అదంతా నా ఖర్మ అంటూ స్వయంగా పవన్ అంగీకరించారు. దీనివల్ల సమాజంలో ఎవరికి నష్టం వచ్చిందో వారే చెప్పాలి. ఆయన మాజీ భార్యలు కూడా… పవన్‌ను పల్లెత్తిమాట అనలేదు. కానీ.. ఇప్పటికీ పవన్ వ్యతిరేకులు. పెళ్లయి విడాకులు తీసుకున్న మహిళల గురించి మాట్లాడుతున్నామనే కనీస జ్ఞానం మరచిపోతున్నారు. రాజకీయాల్లో ఆయనో సంచలనం. డబ్బులు పంచకుండా.. కేవలం నిజాయతీనే నమ్ముకుని గెలుద్దామన్నాడు. ఓడినా గట్టిగా నిలబడదామంటూ పిలుపునిచ్చాడు. 2019 ఎన్నికల్లో పవన్ అడిగితే పరుగెత్తుకొచ్చి కోట్లాదిరూపాయలు పంపిణీ చేసే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వేలాదిమంది ఉన్నారు. అయినా ఎవరి సాయం తీసుకోలేదు.. కేవలం ఏపీ రాష్ట్ర ప్రయోజనం కోసమే 2014లో టీడీపీకు మద్దతు ప్రకటించాడు. అదే పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుంటే నిలదీశాడు. పొత్తు వదలకుని బయటకు వచ్చాడు. ఇటీవల బీజేపీతో దోస్తీ కూడా.. నమ్మిన సిద్ధాంతాన్ని కొనసాగించేందుకు తోడ్పాటు కోసమే అని ఆయన చెప్పారు. అన్నీ కళ్లెదుట కనిపిస్తుండగా.. వర్మ ఏం చెబుతాడు.. పవన్ జీవితాన్ని ఎలా వక్రీకరించబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇన్ని జరుగుతున్నా పవన్ మౌనంగా ఉన్నారు. పవన్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నా.. సంయమనం పాటిస్తున్నారు.