వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. నిజమే.. రాజకీయాలు చేయాలంటే రాజకీయ నేతగా నే ఆలోచించాలి. మానవత్వం.. బావోద్వేగం ఇవన్నీ అక్కడ పనికిరావు. దీన్ని అక్షరాలా ఆచరించి విజయం సాధించటంలో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి. ఎప్పుడు వచ్చామనేది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా! అనేది ముఖ్యం. ఏళ్ల చరిత్ర.. అపార అనుభవం ఉందని ఎవడి జబ్బలు వాడే కొట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆచితూచి వ్వవహరంచటం. అలవి కానిచోట అధికుల మనరాదన్నట్టుగా.. మనది కానప్పుడు కాస్త దూరంగా ఉండాలంటాడో కవి. జగన్ రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో. ఎక్కడ నెగ్గాలో అన్నీ ఆకళింపు చేసుకుని మరీ పావులు కదుపుతున్నాడు. అపార అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండులు సైతం ఉలికిపాటుకు గురయ్యేలా రాజకీయ చదరంగంలో మంత్రులను, అశ్వికదళాన్ని అదను చూసి వినియోగిస్తున్నాడు. ఓస్ ఇదంతా ఎందుకంటారా.. జగన్ మోహన్‌రెడ్డి కుటుంబం.. క్రైస్తవం స్వీకరించారు. ప్రతి ఏటా క్రిస్మస్ సమయంలో ఇజ్రాయేల్ వెళ్లొస్తుంటారు. అయినా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఏ నాడూ మత ముద్ర వేయలేకపోయారు. కానీ ఆయన వారసుడిగా జగన్‌ను దూరంగా ఉంచేందుకు.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ వరకూ ప్రతి పార్టీ ఏదోక విషయంలో జగన్‌ను జనం నుంచి దూరం చేయానే ప్రయత్నాలు సాగించింది.. రాబోయే రోజుల్లోనూ సాగిస్తూనే ఉంటారనేది వైసీపీ శ్రేణులు వాదన.
దీనిలో భాగమే.. 2019 మే చివర్లో ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి జగన్ మతం, సంప్రదాయాలపై ప్రత్యర్థులు విషం చిమ్ముతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో శారదాపీఠంలో జగన్ హిందుత్వం స్వీకరించారు. అనుసరిస్తున్నారు. అదే సమయంలో క్రైస్తవాన్ని ఆరాధిస్తున్నారు. లౌకిక దేశంలో ఎవరు ఏ మతాన్నయినా అనుసరించే వీలుంది. జగన్ కూడా అదే చేస్తున్నాడు. గత కొద్దికాలంగా ఏపీలో అటు విజయనగరం నుంచి ఇటు. కృష్ణాజిల్లా వరకూ వివిధ దేవాలయాలపై దాడులు జరిగాయి. వీటిలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయం వంటివి సంచలనంగా మారాయి. దీనిపై విపక్షాలన్నీ మూకుమ్మడిగా ధర్నాలు చేశాయి. జనంలోనూ ఇవే నిరసను పెల్లుబుకాయి. ఇక్కడే సీఎం జగన్ సంయమనం పాటించారనిపిస్తుంది. అయితే మంత్రులు వెల్లంపల్లి, కొడాలి మాత్రం ఒకింత ఎమోషన్‌కు గురయ్యారు. బీజేపీ ట్రాప్‌లో పడిపోయారు. నోరుజారి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. ప్రభుత్వాధినేతగా జగన్ మాత్రం హుందాగా ప్రవర్తించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాల పరిరక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు, అంతర్వేది రథం నిర్మాణం చేయించారు. చంద్రబాబు హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టడం ద్వారా చంద్రబాబు అసలు సిసలైన హిందు వ్యతిరేకి అనే ముద్ర వేయటంలో విజయం సాధించారు. అంతర్వేదిరథం ప్రారంభోత్సవానికి వెళ్లటం, కనకదుర్గమ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు, తిరుమల పర్యటన ఇలా.. హిందు వ్యతిరేకిగా జగన్‌ను ప్రజల ముంగిట దోషిగా నిలపాలని చూసిన వాళ్లకు తానే హిందుత్వాన్ని గౌరవిస్తానంటూ తన చేతల ద్వారా జగన్ చేసి చూపుతున్నారు. ఇది విపక్షాల గొంతులో వెలక్కాయపడినట్టుగానే వైసీపీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి. కాబట్టే.. గత పంచాయితీ ఎన్నికల్లో జనం తమకు బ్రహ్మరథం పట్టారని.. మున్సిపల్ ఎలక్షన్స్‌లోనూ క్లీన్ స్వీప్ చేసి చూపుతామనే ధీమాగా చెబుతున్నారు. జగన్ వ్యూహానికి మున్ముందు ఏపీలో విపక్షాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఉండరంటూ మరీ సవాల్ చేస్తున్నారు.