కుంభమేళా సంప్రదాయమైన వేడుక. లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకూ హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చారు. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఇటువంటి మేళాలు జరపించారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు దుమ్మెత్తిపోశారు. హాజరైన భక్తుల్లో లక్షలాదిమంది కి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిందంటూ కూడా చెప్పుకోచ్చారు. అయితే అదంతా ఒట్టి బూటకమని.. కావాలనే కొందరు పనిగట్టుకుని విషప్రచారం చేసినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఆధారాలతో సహా విషయం వెలుగులోకి రావటంతో అక్కడి ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీచేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్ముతాయి. అక్కడి అధికారులు, ల్యాబ్‌లు కలసి ఎంతగా మోసానికి తెగబడ్డారనేది గుర్తిస్తే హిందుత్వ వాదులు వారిపై దుమ్మెత్తిపోయకుండా ఉండలేరు. కుంభమేళాకు వచ్చిన భక్తులకు కొవిడ్ పరీక్ష బాధ్యతను 22 ల్యాబ్‌లకు అప్పగించారు. యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయటం వీరి బాధ్యత. అక్కడే ల్యాబ్‌లు డబ్బులకు కక్కుర్తిపడ్డాయి. ఒక నమ్మకంపై తాము బురదజల్లుతున్నామనే విచక్షణ మరచిపోయాయి. ఇప్పుడు అసలు విషయం బయటపడిన విషయం ఏమిటంటే.. కుంభమేళాకు వచ్చిన వారిలో కేవలం 200 మందికి మాత్రమే వైద్యపరీక్షలు చేసి వేలాది మందికి రిపోర్టు ఇచ్చినట్టు నివేదిక రాశారు. ఒకే ఫోన్ నెంబరుపై 50 మందికి కొవిడ్ టెస్ట్ చేసినట్టు చూపారు. 700 మందికి పరీక్ష నివేదిక ఇచ్చారు.ఓవరాల్‌గా లక్ష మందికి కొవిడ్ పాజిటివ్ అని తప్పుడు నివేదిక ఇచ్చినట్టు గుర్తించారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యకు సిద్ధమవుతుందనే చూడాల్సిందే.