కౌలు రైతులకు అండగా జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి,జిల్లాల వారీగా చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శిస్తూ వారికి లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది.ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా టీం పిడికిలి వారు 175 నియోజకవర్గాలకు గోడ పత్రికలు, ఆటో స్టిక్కర్ లు విడుదల చేయడం జరిగింది.

అలాగే మన నందిగామ నియోజకవర్గానికి కూడా *’టీమ్ పిడికిలి”* వారు పోస్టర్లను పంపించడం జరిగింది.

ఈరోజు ఉదయం అనగా 29/05/22 ఆదివారం ఉదయం 9 గంటలకు నందిగామ నియోజకవర్గ జనసేనపార్టీ ఆఫీస్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై పోస్టర్లను ఆవిష్కరించడం జరగింది. అలాగే నందిగామ కొత్త బస్ స్టాండ్ సెంటర్ లోని ఆటో లకు అంటించడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో నందిగామ అధ్యక్షులు కుడుపుగంటి రామరావు, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షులు, బేతపూడి జయరాజు, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షులు నాయని సతీష్, నియోజక వర్గ నాయకులు కామీ శెట్టి వెంకటేశ్వరరావు,తోట వేణు నియోజక వర్గ మహిళా నాయకురాలు తోటకూర పద్మావతి, మేకపోతుల శ్రీ లక్ష్మి, చనమాల సౌందర్య, తాటి విజయా, సూర సత్యం,రామీసెట్టి గురునాధం, హనుమంతు, రాజేష్ కుమ్మరి, వేణు,ఖాసీం, సూర్యతేజ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here