వైసీపీ ఏలుబడి మొదలై.. ఏడాదిన్నర కావస్తోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగానే వెళ్తున్నారు. మంత్రిపదవులు విషయంలోనూ అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యతనిచ్చారు. 2.5ఏళ్ల తరువాత కొత్తవారికి అవకాశం అంటూ ఆశకల్పించారు. మంత్రిపదవిపై ఆశపెట్టుకున్న కొందరు అలిగితే.. వారిని సముదాయించి నామినేటెడ్ పోస్టులతో అలకతీర్చారు. ఎమ్మెల్సీలు మోపీదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు చేరటంతో మంత్రిపదవులు ఖాళీ అయ్యాయి. వాటిని తాజాగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన గోపాల కృష్ణ.. మంత్రి పదవులు దక్కించుకున్నారు. మంత్రి ధర్మానకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడు మిగిలిన ఆశవహుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. జగన్ దృష్టిలో పడేందుకు తాడికొండ శ్రీదేవి, విడదల రజనీ, అంబటి రాంబాబు.. ఇలా చాలామంది అవకాశం చిక్కినప్పుడల్లా జగన్‌ను ప్రశంసిస్తూ.. బాబును దుయ్యబడుతున్నారు. తమ స్వరంవల్ల అయినా.. భవిష్యత్‌తో మంత్రి పదవి వస్తుందనే ఆశ పడుతున్నారు. శాసనసస్పీకర్ తమ్మినేని సీతారాం కూడా .. సభాపతి నుంచి బయటకు వచ్చి మాంచి మంత్రిపదవి చేపట్టాలని ఆశపడుతున్నారట. మరి ఎటుచూసినా సమీకరణకే మొదట ఓటు అంటున్న అధినేత జగన్ మోహన్‌రెడ్డి.. మున్ముందు ఎవరికి మంత్రి పదవి కట్టబెడతారో..చూడాలి మరీ!