దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు పొందిన హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర మరో అద్భుతమైన ఘనత సాధించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. “మంత్ ఆఫ్ మధు” సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో “అందాల రాక్షసి” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం “గేమ్ ఛేంజర్” వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “ఇన్స్పెక్టర్ రుషి” వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు. ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలతో, సినిమాలతో మనల్ని అలరించబోతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు.

Previous article“ప్రేమికుడు” రీ-రిలీజ్ పోస్టుపోన్
Next articleఎఫ్ ఎన్ సి సి కమిటీ సభ్యులు చేతుల మీదగా మే డే సందర్భంగా ఉద్యోగులకు సత్కారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here