ప్రముఖ నటుడు.. రచయిత రావి కొండలరావు కనుమూశారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దాదాపు 600కు పైగా సినిమాలు, 1000కు పైగా రచనలు చేసిన ఆయన సతీమణి రాధాకుమారి కొన్నేళ్ల క్రితం మరణించారు. భార్యభర్తలిద్దరూ నటీనటులుగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. గొప్ప దంపతులుగా చెరగని ముద్రవేసుకున్నారు.