చైనా ప్రపంచంపై కరోనా వైరస్ వదిలింది. దాదాపు అంతర్జాతీయ వ్యాపార నగరాలను అతలాకుతలం చేసింది. పనిలో పనిగా భారత్ భూభాగాన్ని తన్నుకుపోదామని ఎత్తుగడ వేసింది. మక్‌మోహన్ రేఖ వద్ద ఏకంగా 50,000 మంది సైనికులను రంగంలోకి దింపింది. కానీ.. అక్కడ భారత్ సైనికుల దైర్యసాహసాలను తాను రుచిచూడబోతున్నానని మరచింది. తెలుగు వీర జవాన్ కర్నల్ సంతోష్‌బాబు రూపంలో ఒక్కసారిగా చైనా సైనికులపై విరుచుకుపడటంతో చిప్పకళ్ల సైన్యం ఉలికిపాటుకు గురైంది. ఒకటికి పది తలలు తెంపి సమాధానమిచ్చి అమరుడయ్యాడు సంతోష్‌బాబు. నరేంద్ర మోదీ ఇక్కడ రాజనీతి ఉపయోగించారు. అకస్మాత్తుగా లడ్హాఖ్ సరిహద్దులకు చేరి సైనికులకు సంఘీభావం తెలిపారు. మీ ఇష్టం.. దేశం కోసం ఏదైనా చేయమంటూ స్వేచ్ఛనిచ్చారు. మరో వైపు రాజ్‌నాథ్‌సింగ్ మిత్రదేశాలతో మంతనాలు సాగించారు. యుద్ధం అనివార్యమైతే ఆయుధసాయం ఎవరిని ఎంత వరకూ అందుతుందనేది అంచనా వేసుకున్నారు. ఫ్రాన్స్ కూడా రాఫెల్ యుద్ధవిమానాలను అందజేస్తానంది. ఇపుడు అదే జరుగుతుంది. ఫ్రాన్స్ నుంచి అంటే.. సుమారు 7,364 కిలోమీటర్ల దూరం నుంచి ఇండియాకు రాఫెల్ యుద్ధవిమానాలు బయల్దేరాయి. ఆకాశమార్గంలో మధ్యలో ఇందనం నింపుకుంటూ.. బుధవారం ఇండియా సరిహద్దులకు చేరతాయి. దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ ప్రపంచంలోనే అత్యాథునిక యుద్ధవిమానం. దీని మొత్తం బరువు 24,500 కిలోలు, 9,500 కిలోల బరువు మోయగలదు. గంటకు 2.2226 కి.మీ వేగంతో దూసుకెళ్ల గల సత్తా దీనిసొంతం. సుధూర లక్ష్యాలను చేధించగల మిస్సైల్స్‌ను తేలికగా ప్రయోగించవచ్చు. 3,700 కిలోమీటర్ల రేంజ్ గల రాఫెల్ సెకన్ల వ్యవధిలో శత్రు శిభిరాలను తునాతునకలు చేయగలదు. రెప్పపాటులో అపారనష్టాన్ని కలిగించి తిరిగి రాగలదు. ఇది చైనా పాకిస్తాన్ బోర్డర్‌లో ఉంచటం ద్వారా ఇరు దేశాలకు భారత్ గట్టి సంకేతం పంపనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఇండియాపై దాడి చేయాలనే ఆలోచన బుర్రలోకి చేరితే చాలు.. క్షణాల్లో భస్మం చేయగలం అని భారత్ చాటినట్టయింది. యుద్ధానికి రెఢీ అంటూ.. చైనా కారుకూతలు.. భారత సైనికుల అపార సాహసాలు.. తెగింపు.. వీటికి మరింత బలాన్నిచ్చే రాఫెల్ ఫైటర్ జెట్స్ రాకతో మూతపడతాయనుకోవచ్చంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.