హిందువుల ఆరాధ్యుడు రాముడు కొలువుదీరిన స్థలం అయోధ్య. శతాబ్దాలుగా భారతీయుల నమ్మకం. రాముడు కేవలం పాలకుడే కాదు.. సర్వకాలాలకూ మార్గదర్శకుడు. అంతటి మహనీయుడు పుట్టిన స్థలాన్ని ఎవరో కూలగొడితే ఊరుకుంటారా! అందుకే వందల ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయపరమైన ఇబ్బందులనూ అధిగమించారు. అగస్టు 5న అయోధ్యలో రాముడి మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ప్రముఖులు తరలిరానున్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న సమయంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ ఐ దాన్ని ఛిద్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు భారత నిఘావర్గాలు గుర్తించాయి. దీంతో అయోధ్య పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. గతేడాది అగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసింది. దీనిపై పాకిస్తాన్ నానాయాగీ చేసింది. కశ్మీరులు కూడా తిరుగుబాటు చేస్తారని హెచ్చరించింది. కానీ కశ్మీరులు కూడా ప్రధాని నిర్ణయానికి జై కొట్టారు. దీంతో పాక్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి చేరింది. తన అక్కసును వెళ్లబోసుకుంటూనే ఉంది. అయినా ప్రపంచదేశాల నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఎలాగైనా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే దురుద్దేశంతో అయోధ్యలో కల్లోలం సృష్టించాలని ఐఎస్ ఐ కుట్రపన్నింది. సరిహద్దుల వద్దనే సాగని పాక్ ఆటలు.. భారత నడిమధ్యలో ఎలా సాగుతాయని పాక్ భావించటం అవివేకమంటూ భద్రతావర్గాలు హెచ్చరిస్తున్నాయి.