దర్శక దిగ్గజం.. ఎస్.ఎస్.రాజమౌళి కరోనా భారీనపడ్డారు. కొద్దిరోజులుగా తనకు.. కుటుంబ సభ్యులకూ కొద్దిగా జ్వరం వచ్చిందన్నారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చినట్టు రాజమౌళి తానే స్వయంగా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులంతా.. హోం క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎవరికీ లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహా ప్రకారం నడుచుకుంటున్నట్టు వెల్లడించారు.