కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా రమేష్ స్టూడియోస్ ఘన ప్రారంభం

ఈరోజు మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోస్ ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు ప్రారంభించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రమేష్ స్టూడియోస్ ను అలాగే డిఐ సూట్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ అయిన బీర్ల ఐలయ్య గారి చేతుల మీదగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి గారి చేతుల మీదగా రెండవ సెకండు సూట్ ఓపెన్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ & చత్రపురి ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు, నల్గొండ డిసిఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట రెడ్డి గారు, ఇంకా పలువురు కౌన్సిలర్స్ అలాగే సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ స్టూడియోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Previous articleకోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదగా ‘ఎల్.వై.ఎఫ్’ చిత్ర టీజర్ లాంచ్
Next articleవియారా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ని ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here