ఇండియా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అత్యథిక అమెరికన్లు భారత్‌కు జై కొడుతున్నారు. ఇండియాకే తమ మద్దతు చెబుతున్నారు. వాస్తవానికి భారత్‌తో రష్యా చాలా దోస్తీ. ఇది ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం. అమెరికా ఆయుధాలను పాకిస్తాన్‌కు ఇస్తుండటం.. తన స్వార్థం కోసం ఉగ్రవాదాన్ని ఎగదోయటం వంటివి చేస్తుంది కూడా. తాలిబన్ల పుట్టుకకు అమెరికాయే అసలు కారణం. సోవియట్ రష్యాను ముక్కలు చేసేందుకు ఆడిన డ్రామాల్లో ఇదొకటి. ప్రస్తుతం అమెరికన్లు చైనా-భారత్ పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారనే అంశంపై ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇనిస్టిట్యూట్ 1012 మంది అమెరికన్లపై సర్వే చేసినపుడు ఇలా స్పందించారట. ఇరు దేశాల మధ్య సైనిక వివాదం పెరిగితే ఇండియాకే మద్దతు అంటూ 63.5శాతం, ఆర్ధిక వివాదమైతే 60.6శాతం ఎవ్వరికీ మద్దతు ఇవ్వమన్నారట. సైనిక వివాదమైతే 32.6శాతం మంది అమెరికన్లు భారత్‌కే మద్దతు ఇవ్వాలన్నారు. ఏమైనా అమెరికా ప్రజలకు భారతీయుల పట్ల సానుభూతి.. అభిమానం ఉండటం నిజంగా భారతీయత ప్రపంచంలో ఎంతటి ఆదరణ పొందుతుందనేందుకు నిదర్శనం అంటున్నారు అంతర్జాతీయ సామాజికవేత్తలు.