అమరవాతే రాజధాని గా ఉంటుందని ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు తరలించడం పై కృష్ణా,గుంటూరు జిల్లాల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలురాజధాని తరలింపు తమ రాజకీయ జీవితానికి మరణశాసనం అంటున్న వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు
ఇది కోలుకోలేని దెబ్బ అని చాల సార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అంటూ అసంతృప్తి . గుంటూరు జిల్లా లో 15 మంది శాససభ్యులు,కృష్ణా జిల్లా లో 14 మంది శాససభ్యులు పార్టీకి,శాసన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. విజయవాడలోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తకి చెందిన ఒక హోటల్ లో రహస్య మంతనాలు
త్వరలోనే స్పీకర్ ఫార్మెట్ లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కి రాజీనామా లేఖలు పంపనున్న వైఎస్ఆర్సిపి కృష్ణా,గుంటూరు శాసనసభ్యులు
టిడిపి నుండి వైఎస్ఆర్సిపి లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసిన వైఎస్ఆర్సిపి అసమ్మతి వర్గం.రాజీనామా కి అంగీకరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు
తెలుగు దేశం పార్టీ వాళ్లు అమరావతి కోసం రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కౌంటర్ గా మూడురాజధానులకు మద్దతుగా అమరావతి ప్రాంతమైన క్రిష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో గెలిచి..తన నిర్ణయానికి అమరావతి నుంచే ఏ స్థాయిలో మద్దతు వుందో నిరూపించి వచ్చే ఎన్నికలనాటికి టిడిపిని అన్ని ప్రాంతాల్లో బలహీనం చేయాలనేది జగన్‌రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైకాపాకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తుపై ఆందోళనగా వున్నారు. ఇదే విషయాన్ని సీఎం ముందు కూడా వుంచారు. మీరేమీ భయపడొద్దు..ఇంత చేసిన చంద్రబాబుని మీ రెండు జిల్లాల వాళ్లు ఎన్ని సీట్లిచ్చి గౌరవించారు? ఇప్పుడు రాజధాని తరలించినందు వల్ల మనపై వ్యతిరేకత వచ్చేంత నిస్వార్థపరులు మీ జిల్లాల వాళ్లు కాదంటు తనకు ఇంటిలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్టు చూపారు. ఒకవేళ మీరు ఓడిపోతే మీ రాజకీయ భవిష్యత్తు నా బాధ్యత అంటూ భరోసా ఇచ్చారు. అయినా వైకాపా ఎమ్మెల్యేలకి వాస్తవ పరిస్థితి తెలుసు. అందుకే వాళ్లు వేరే విధంగా ఆలోచిస్తున్నారని సమాచారం.