విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రంలో మహేష్ విట్ట, శైలజమ్మ, టేస్టీ తేజ, జెడివి ప్రసాద్, కరణ్ విజయ్, మిర్చి కిరణ్, ఆకెళ్ళ గోపాల్ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించగా హలేష్ డిఓపిగా పని చేశారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఒక గ్రామంలోని పచారీ కొట్టు నడుపుకునే పెళ్లి కావాల్సిన యువకునికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో ఎంతో ఫ్రస్టేషన్ లో ఉన్న అతను మరొక గ్రామ యువతితో ప్రేమలో పడతాడు. ఇది ఇలా ఉండగా అతడి గ్రామంలో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య కూడా అతని పెళ్లికి ముడి పడడంతో అతను ఆ సమస్యను ఎలా అరికడతాడు? అసలు ఆ వచ్చిన సమస్య ఏంటి? ఇది ఇలా ఉండగా తను ప్రేమించిన యువతి తన ప్రేమను అంగీకరిస్తుందా? ఆ యువతి సైడ్ నుండి ఉన్న ఇబ్బంది ఏంటి? ఆ ఇరు గ్రామాల ప్రజలు వారి పెళ్లికి సపోర్ట్ చేస్తారా లేదా? చివరికి వారికి పెళ్లి అవుతుందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ చిత్రంలో బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ (కృష్ణ) ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిలా తన పాత్రను పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. అటు పినాసిగా కనిపిస్తూనే మరోవైపు ఎంతో డైనమిక్ గా ఉండే ఒక మాస్ కుర్రాడిలా కూడా అద్భుతంగా నటించారు. కొన్ని డైలాగ్స్ రాజేంద్రప్రసాద్ గారి వింటేజ్ తరహాలో చెబుతూ యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ వంటి ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. శైలి చౌదరి (సుమతి) తన పాత్రలో ఎంతగానో ఒదిగిపోయారు. ఒక పల్లెటూరి అమ్మాయిల గా సాధారణంగా కనిపిస్తూ తెలుగు అమ్మాయి కానప్పటికీ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. సినిమాలో తన పాత్ర కంటూ తనదైన ముద్రను వేసుకున్నారు. అలాగే సినిమా అంతటా హీరో పక్కనే కనిపిస్తూ టేస్టీ తేజ కామెడీతో పాటు తన టైమింగ్ తో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అలాగే సినిమాలో ఇతర పాత్రలో నటించిన మహేష్ విట్ట, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్, ఆకెళ్ళ గోపాల్ కృష్ణ పాత్రలు అటు కామెడీతో పాటు సినిమాలో తమ పాత్రల ప్రాముఖ్యతను చూపించుకుంటూ సినిమాకు మరింత ప్లస్ గా నిలిచారు. కరణ్ విజయ్ నెగటివ్ గా కనిపిస్తూనే ఊరి కోసం కూడా ఆలోచించే పాత్రలో చాలా బాగా నటించారు. శైలజమ్మ అమరదీప్ కు నానమ్మగా సినిమాలో చక్కటి పాత్రను పోషించారు. అలాగే సినిమాలో ఇతర పాత్రలు పోషించిన నటీనటులు అంతా తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు.
సాంకేతిక విశ్లేషణ :
చాలా సాదాసీదా యువకుడి కథను ప్రేక్షకులు అంతా, మరీ ముఖ్యంగా యువకులు అంతా తమకథగా భావించే విధంగా తాను రాసుకున్న కథను ప్రేక్షకులకు చేరువగా తెరకెక్కించడంలో దర్శకుడు ఎంఎం నాయుడు విజయం సాధించారు. అలాగే ఈ చిత్రానికి ముఖ్యంగా సినిమాలోని లొకేషన్స్ పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ప్రతి సీనరీ చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంది. దానికి తోడు డిఓపి చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి. లైవ్ లొకేషన్స్ కావడం చిత్రానికి ప్లస్ పాయింట్. సినిమాలోని బిజిఎం ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. పాటలు సిచువేషన్ కి తగ్గట్లు వస్తూ సినిమాకు మరో బోనస్ గా నిలిచాయి. అలాగే పాటలలో అమర్దీప్ వేసిన స్టెప్స్ యువతను థియేటర్స్ లో కూడా డాన్స్ వేయించే విధంగా ఉన్నాయి. కొన్ని సీన్లు కాస్త సాగదీసినట్లు ఉన్నప్పటికీ సినిమా చాలా స్మూత్ గా ఉండటం వల్ల ప్రేక్షకులు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఉంది. సినిమాలోని పాత్రల భాష యొక్క యాస పర్ఫెక్ట్ గా ఉంది.
చిత్ర విశ్లేషణ :
సినిమా చూస్తున్నంత సేపు ప్రతి యువకుడు నా పాత్రకు ఈ చిత్రంలోని హీరో పాత్ర దగ్గరగా ఉంది అని ఫీల్ అయ్యేలా ఉండటం విశేషం. టేస్టీ తేజ నటన అక్కడక్కడ కాస్త ఓవర్ అనిపించినప్పటికీ తన పాత్ర అలాగే ఉండటం వల్ల తాను గట్టిగా మాట్లాడినట్లు అర్థమవుతుంది. అలాగే కొన్ని ఫైట్ సీన్స్ కాస్త అతిగా అనిపించాయి. సినిమాలోని డివోషనల్ పాయింట్స్ ప్రేక్షకులకు గూజ్ బామ్స్ తెప్పించేలా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, బిజిఎం, లొకేషన్స్, పాటలు, డాన్స్.
నెగిటివ్ పాయింట్స్ :
కొన్ని సీన్స్ స్లోగా ఉండటం, ఫైట్స్.
సారాంశం :
అటు డివోషనల్ టచ్ తో ఒక యువకుడి ప్రేమ కథను ఊరి సమస్యలతో ముడివేసి ప్రేక్షకులు అర్థం అయ్యేలా అలాగే ప్రేక్షకులు తీసుకునే విధంగా సామాజిక స్పృహతో కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం.
రేటింగ్ : 3.25/5



