ఘనంగా “అలా జరిగిన కథ” చిత్ర తొలి ప్రెస్ మీట్ 

ఎపిఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రేణుక శ్రీనివాస్ నిర్మాతగా ప్రభు సూర్య దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం అలా జరిగిన కథ. కెవి గోలంధర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మహావీర్ సంగీతాన్ని అందించగా కొండవీటి రవి కుమార్ ఎడిటర్ గా పని చేశారు. విజయ్, శీతల్ భట్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్రం శ్రీను, రవి వర్మ, శివ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

 

నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాకు నాకు చాలా అనుబంధం ఉంది. దర్శకుడు సూర్యకు సినిమాలపై మంచి అవగాహన ఉంది. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని బాధ్యతలు నాకు అప్పగించినప్పుడు నేను కొంత మంది నటీనటులతో, టెక్నీషియన్స్ తో మాట్లాడటం జరిగింది. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నారు. మీడియా వారు అంతా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమాలో నేను మంచి పాత్ర చేశాను. ఈ సినిమా ద్వారా దర్శక నిర్మాతలకు మంచి పేరు వస్తుంది. నిర్మాత రేణుక గారు సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు” అన్నారు.

 

నటుడు రవి వర్మ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నన్ను ఈ సినిమాలోకి తీసుకుని వచ్చింది చిత్రం శ్రీను. కొత్తగా చేయాలంటే అది థ్రిల్లర్ జోనర్ లో మాత్రమే. కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. సినిమా చేసిన తర్వాత ఫుటేజ్ చూసి ఆశ్చర్యపోయాను, అంత అద్భుతంగా అనిపించింది. సినిమాలో చూపించిన ఫ్రేమ్స్, సినిమా వెళ్తున్న విధానం బాగా నచ్చాయి. నాకు ఈ అవకాశం రావడానికి కారణం అయిన శ్రీను, దర్శక నిర్మాతలకు థాంక్స్. విజయ్ కు ఈ సినిమా మంచి మార్క్ గా ఉండిపోతుంది. నాతో నటించిన నటీనటులకు థాంక్స్. అందరూ ఈ సినిమాకు మంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ… “మా సినిమా నటీనటులకు, చిత్ర బృందం వారికి, మీడియా వారికి నమస్కారం. నాకు దర్శకుడు ప్రభు సూర్య అంటే ప్రత్యేక అభిమానం. సినిమాలో నా పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. కథ కూడా చాల కొత్తగా ఉంటుంది. అందరూ ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

 

బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను పోలీస్ అధికారిగా నటించాను. నేను ఈ సినిమాలో నటించడానికి కారణం చిత్రం శ్రీను, మా ప్రయాణం సంవత్సరాల నాటిది. మమ్మల్ని తెరపై బాగా చూపించిన డిఓపి గారికి థాంక్స్. నాకు వచ్చిన పాత్రకు నేను న్యాయం చేశాను. సినిమాలో హీరోగా నటించిన విజయ్ కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా త్వరలో థియేటర్ లో విడుదల కానుంది. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

 

సంగీత దర్శకుడు మహావీర్ మాట్లాడుతూ… “నాకు తొలిగా ఈ సినిమాలో అవకాశం వచ్చేలా చేసిన శ్రీను గారికి, ఈ సినిమా దర్శక నిర్మాతలకు, నటీనటులకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమాకు సపోర్ట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

 

డిఓపి కెవి గోలంధర్ మాట్లాడుతూ… “ఈ సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారు. సినిమా చిత్ర బృందం అందరికీ థాంక్స్” అన్నారు.

 

హీరో విజయ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నన్ను ఈ సినిమాలో ఎంకరేజ్ చేసిన చిత్ర బృందం వారికి అందరికీ థాంక్స్. మాకు ఈ సినిమాలో మంచి సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. అందరూ ఈ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

 

నిర్మాత రేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది మా బ్యానర్ నుండి వస్తున్న తొలి చిత్రం అలా జరిగిన కథ తొలి ప్రెస్ మీట్. సూర్య గారు నాకు సినిమా కథ చెప్పినప్పుడు మంచి సక్సెస్ అవుతుందని నమ్మకంతో కథకు కనెక్ట్ అయ్యాను. సినిమాలో నటించిన నటీనటులు అలాగే సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులు చాలా బాగా చేశారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వీరు అందరూ మా కొత్త బ్యానర్ కు బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా చిత్రం శ్రీను గారు ముందుండి నడిపించారు. విజయ్ ఈ సినిమాలో కొత్త నటుడిలా అనిపించారు, ముందు ముందు మరిన్ని మంచి సినిమాలలో నటిస్తారు. జ్యోతి, వర్మ పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. సూర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా వారు అందరూ మా సినిమాకు సపోర్ట్ చేసి మా నూతన బ్యానర్ ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

దర్శకుడు ప్రభు సూర్య మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. సినిమా ముందుగా చేద్దాం అనుకున్నప్పుడు నా శ్రేయోభిలాషి అయిన శ్రీను గారికి చెప్పినప్పుడు ఆయన నన్ను నిర్మాతకు పరిచయం చేశారు. ఆమెకు చాలా నచ్చి ఓకే చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ నచ్చి ఓకే చేశారు. వారి పాత్రలు ఈ సినిమాలో కొత్తగా ఉంటున్నాయి. దానికి వారు అంత మరింత బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అందరికీ థాంక్స్. మా సినిమాను అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము” అంటూ ముగించారు.

 

నటీనటులు : విజయ్, శీతల్ భట్, చిత్రం శ్రీను, రవి వర్మ, శివ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, జబర్దస్త్ రాజమౌళి తదితరులు.

 

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు : ప్రభు సూర్య

నిర్మాత : రేణుక శ్రీనివాస్

బ్యానర్ : ఎపిఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్

డీఓపీ : కెవి గోలంధర్

ఎడిటర్ : కొండవీటి రవి కుమార్

సంగీత దర్శకుడు : మహావీర్

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : చిత్రం శ్రీను, ఎం లక్ష్మణ్ బాబు, శీలం ప్రణయ్ కుమార్ రెడ్డి

కోరియోగ్రఫీ : రాజు మాస్టర్

ఫైట్స్ : అజయ్

పబ్లిసిటీ డిజైన్స్ : సబేర్ అలీ

పిఆర్వో : మధు విఆర్

Previous articleWAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here