యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “మా రాముడు అందరివాడు”. ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. యద్దనపూడి మైకేల్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. శ్రీరామ్ సరసన స్వాతి హీరోయిన్ గా కనిపించనుంది. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో “మా రాముడు అందరివాడు” సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేశారు. ఈ పాటకు డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ సాహిత్యాన్ని అందించి, నల్లగొండ గద్దర్ గా ప్రసిద్ధమైన నర్సారెడ్డి గారితో కలిసి పాడారు. ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, నిర్మాత, నటుడు అనుముల లక్ష్మణరావు, డైరెక్టర్, సాంగ్ రైటర్ యద్ధనపూడి మైఖేల్, సింగర్ నల్లగొండ గద్దర్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
“మా రాముడు అందరివాడు” సినిమాలో తండ్రిని కోల్పోయిన కొడుకు అలాగే గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఊరి ప్రజలు కలిసి విషాధంతో పాడుకునే ఒక అద్భుతమైన పాట ‘ఇడిసెల్లిపోయావా..’. ఈ పాట చాలా బాగుందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రశంసించారు. ‘ఇడిసెల్లిపోయావా..’ పాటను, పాట పోస్టర్స్ ను ఆయన లాంఛ్ చేసి, సాంగ్ విన్నారు. “మా రాముడు అందరివాడు” మూవీ మంచి విజయం సాధిస్తుందని ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు.
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ -* ఈ రోజు “మా రాముడు అందరివాడు” సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ పాటను డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ మంచి సాహిత్యంతో రాశారు. నల్లగొండ గద్దర్ నర్సారెడ్డి అన్న బ్రహ్మాండంగా పాడారు. ఇది చాలా మంచి సినిమా. సమాజానికి దిక్సూచిగా నిలిచే సందేశంతో మిమ్మల్ని అలరించే వినోదంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరించాలి. అలాగే ఇలాంటి కొత్త టాలెంట్ ను మీరంతా ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. అన్నారు.
తమ సినిమా నుంచి ‘ఇడిసెల్లిపోయావా..’ సాంగ్ లాంఛ్ చేసి, తమ మూవీకి సపోర్ట్ చేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి హీరో శ్రీరామ్, నిర్మాత అనుముల లక్ష్మణరావు, డైరెక్టర్ యద్ధనపూడి మైఖేల్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే “మా రాముడు అందరివాడు” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని వారు తెలియజేశారు.



