ఫాఫం.. నిమ్మ‌గ‌డ్డ ఇలా అయ్యారేమిట‌బ్బా!

సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌. రాజ‌కీయ చంద‌రంగంలో పావుగా మారాడు. ఈ వల‌యం నుంచి తేలిక‌గా బ‌య‌ట‌ప‌డ‌తారా! చిక్కుకుని విల‌విల లాడ‌తారా అనేది ఆసక్తిగా మారింది. గ‌తంలోనూ ఐఏఎస్‌లు రాజ‌కీయ నేత‌ల చెప్పుచేత‌ల్లో ఉండి అద్భుత‌మైన కెరీర్‌ను చేతులారా నాశ‌నం చేసుకున్నారు. ఆ నాడు ఎన్టీఆర్ నుంచి వైఎస్సార్ వ‌ర‌కూ.. త‌రువాత చంద్ర‌బాబు అండ్ కో వ‌ల్ల కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు స‌ర్వీసుల‌ను చాలా న‌ష్ట‌పోయార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం అటువంటి ఏపీ రాజ‌కీయాల్లో నిమ్మ‌గ‌డ్డ ఎపిసోడ్ లో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  జ‌గ‌న్ అండ్ కో నువ్వు క‌మ్మ‌.. అంటూ వేలెత్తిచూపితే తాడోపేడో తేల్చుకోవాల‌ని సిద్ధ‌మైన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ అనేబ‌డే ఎన్నిక‌ల అధికారి ఎట్ట‌కేల‌కు సీట్లో కూర్చున్నాడు. త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చిన క‌న‌గరాజ్ ఇప్పుడేం చేస్తార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. ఏపీలో ఉన్న క‌న‌గ‌రాజ్‌.. తెలంగాణ‌లో ఉన్న నిమ్మ‌గ‌డ్డ ఇద్ద‌రిలో ఎవ‌రి చేతిలో ప‌వ‌ర్ ఉంది.. స్థానిక ఎన్నిక‌లు ఎవ‌రి ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతాయ‌నేది మ‌రో చిక్కు ప్ర‌శ్న‌. ఏమైనా.. తాజాగా ఎన్ ఈసీ సెక్ర‌ట‌రీగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వాణీమోహ‌న్‌ను నియ‌మించింది ఏపీ స‌ర్కారు. నిమ్మ‌గ‌డ్డ బాధ్య‌త‌లు తీసుకున్నారంటూ ఇచ్చిన 317 స‌ర్క్యుల‌ర్‌ను కూడా ర‌ద్దుచేశారు.  ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. దానికంటే ముందుగా.. మాజీ ఎమ్మెల్యే మ‌స్తాన్‌వ‌లీ పేరిట న‌ర్రా శ్రీనివాస‌రావు అనే న్యాయ‌మాది సుప్రీంకోర్టులోకెవియ‌ట్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.  2016లో బాధ్య‌త‌లు చేప‌ట్టిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ నియామ‌క‌మే త‌ప్పంటూ  కొత్త‌వాద‌న తెర‌మీద‌కు తెచ్చిన ఏపీ ప్ర‌భుత్వం..  దీన్ని తాము అంత తేలిక‌గా తీసుకోలేద‌నే సంకేత‌మిచ్చింది. త‌ర‌చూ  హైకోర్టులో ఎదుర‌వుతున్న ఓట‌ముల‌తో జ‌గ‌న్ కూడా న్యాయ‌కోవిదుల నుంచి సూచ‌న‌లు స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడ‌కుండా.. దేశంలోనే పేరున్న లాయ‌ర్ల జాబితాను సిద్ధం చేయ‌మంటూ పార్టీ నేత‌ల‌కూ హుకుం జారీచేశార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here