తన సినిమాను ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తున్ననారో తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. దానిలో తప్పులేదు.
ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవటం భాధాకరం, సంఘటన జరిగిన విషయం ఆయన సిబ్బంది వెంటనే చెప్పి ఉండాలి.
సంఘటన జరిగిన మరుసటి రోజు హీరోకాకపోయినా సినిమా టీం, డైరెక్టర్, నిర్మాత ఎవరో ఒక్కరు వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించాల్సింది.
కనీసం దేవాలయాల్లో బాబుకోల్కోవాలని పూజలు చెయ్యాల్సింది. అలా జరగలేదు.
కొన్ని సార్లు మనం తప్పు చెయ్యకపోయినా పరిస్థితుల ప్రభావంతో సారీ చెప్పాలి.. నేను నా అభిమానులు బ్యానర్లు కడుతూ చనిపోయిన సంఘటన లో నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళను ఓదార్చాను. కొన్నిసార్లు తిట్లూ తిన్నాను.
పాపం అందరూ కలిసి అల్లూ అర్జున్ ని కార్నర్ చేసేసారు. ఇక్కడ సినిమా యూనిట్ మొత్తం భాద్యత తీసుకోవాలి అలాజరగకుండా కేవలం హీరోని మాత్రమే టార్గెట్ చేసారు. సినిమా నిర్మాతలు ఇంకా బాగా స్పందించాల్సి ఉంది.
వెళ్ళిపోయెప్పుడు అల్లు అర్జున్ అభివాదం చేయకపోతే అది వేరేలా అర్దం చేసుకుంటారు. హీరోలు రాజకీయ నాయకులు వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు అభివాదం చేయడం సహజం .
– పవన్ కళ్యాణ్