రోజు రోజుకి పుస్తకాలు కొని చదువుకొనే వారి సంఖ్య తగ్గుతున్న ఈ ఇంటర్నెట్ కాలంలో, ప్రఖ్యాత చేతివ్రాత నిపుణులు మల్లికార్జున్ మరియు తెలుగు భాషాభిమానం గల వి.వి. ఆర్ కిషన్ ఒక తెలుగు వెబ్సైటు CHADUVARI.COM ని రూపొందిచారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వెబ్సైటు పరిచయ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుణులు యండమూరి.వీరేంద్రనాధ్ ఈ వెబ్సైటును ప్రారంభించారు. ఇందులో యండమూరి.వీరేంద్రనాధ్ రచించిన తెలుగు ఆన్ లైన్ సీరియల్ ” నిశబ్ద విస్ఫోటనం ” అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యండమూరి.వీరేంద్రనాధ్ మాట్లాడుతూ ఈ సీరియల్ పై వచ్చే ఆదాయాన్ని కరోనా భాదితులకు సేవ చేసే స్వచ్చంద సంస్థలకు, ఆదాయం కోల్పోయిన అల్పాదాయ వర్గాలకు విరాళంగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
తెలుగు చదువు డిజిటల్ గా రావాల్సిన అవసరాన్ని గుర్తించి తెలుగు పుస్తకాలు ఆన్లైన్లో అమ్మకం మరియు డిజిటల్ పుస్తకాలు సంకలనం ఈ వెబ్సైట్లో రూపొందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు ముఖ్యంగా తెలుగు కథలు కవితల తో పాటు తెలుగు రచయితల పరిచయం, తెలుగు భాషాభిమానం ఉన్న రచయితల కాలమ్, రచయితల పరిచయచేస్తూ ముందుకు తీసుకువెళ్లాలని నిర్వాహకులు తెలియజేశారు.