హైదరాబాద్, భారతదేశం 08 అక్టోబర్,2020- – పిల్లల జీర్ణసంబంధ ఆరోగ్యానికి తోడ్పడేలా, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడే పండ్ల-రుచిగల గమ్మీ బేర్లు కలిగి ఉన్న కొత్త ఉత్పత్తి అయిన డుఫాలాక్TM బేర్లను భారతదేశంలో ప్రారంభించినట్లు అబోట్ ఈ రోజు ప్రకటించారు. స్ట్రాబెర్రీ పండ్ల రుచితో ప్రారంభించిన డుఫాలాక్TM బేర్స్ ఒక ఫుడ్ సప్లిమెంట్ మరియు FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇది విశ్వసనీయ ప్రీబయోటిక్ యొక్క ప్రయోజనాలను అందిస్తుంది మరియు జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అదే సమయంలో ప్రతికూల బ్యాక్టీరియా స్థాయిలను తగ్గిస్తుంది. ఈ గమ్మీ బేర్లు తీసుకోవడం పిల్లలకు సులభం మరియు ఆరోగ్యకరమైన పేగు సమతుల్యతను అలాగే ప్రేగు నియంత్రణను ప్రోత్సహిస్తాయి.
గట్(చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు)లోని మంచి బ్యాక్టీరియా స్థాయిలను పెంచడంలో సహాయపడటంతో పాటు, డుఫాలాక్TM బేర్స్‌లో పాలు నుండి తీసుకోబడిన లాక్టులోజ్ అనే ప్రీబయోటిక్ ఉంది, ఇది కాల్షియం శోషణను పెంచడానికి సహాయపడుతుంది, పిల్లల్లో బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకల అభివృద్దికి సహాయపడుతుంది. బాల్య మలబద్దకం యొక్క ప్రాబల్యం 0.7% & 29.6% మధ్య ఉంటుంది, మరియు చాలా సందర్భాలలో పిల్లలు రెండు నుండి మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, టాయిలెట్ శిక్షణ వయస్సులో ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటారు. మంచి పోషకాహారం ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది, ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడం ద్వారా మరియు అవసరమైన పోషకాలు సరిగ్గా గ్రహించబడటం ద్వారా, పిల్లలు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, మానవ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో దాదాపు 70% గట్(చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు)లో చురుకుగా పనిచేస్తాయి, మంచి రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యానికి బాగా పనిచేసే జీర్ణవ్యవస్థ చాలా అవసరం. రుచికరమైన, నమలని లాక్టులోజ్-ఆధారిత గమ్మీలు మలం మృదువుగా మరియు సాధారణ కదలికను సులభతరం చేయడం ద్వారా బాల్య మలబద్దకం యొక్క లక్షణాలను తొలగించడానికి సహాయపడతాయి.
“పలు కారకాలు బాల్య మలబద్దకాన్ని ప్రేరేపిస్తాయి, వీటిలో ఉదయపు నిత్యకృత్యాలు, కష్టతరమైన టాయిలెట్ శిక్షణ సమయాలు మరియు సరైన పోషకాలు లేని ఆహారం ఉన్నాయి.11 దీనికి సమర్థవంతంగా చికిత్స చేయగలిగినప్పటికీ, 30% మంది తల్లిదండ్రులు మాత్రమే సమయానికి వైద్యుడిని సంప్రదిస్తారని మా పరిశోధన తెలుపుతుంది. సాధారణంగా నిబద్దత లేకపోవడం వల్ల, తరచూ చికిత్స పొందుతున్న పిల్లలు కూడా పునఃస్థితి(తిరగబెట్టే స్థితి)ని కలిగి ఉంటారని శిశువైద్యులు కూడా గమనించారు” అని అబోట్ ఇండియా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరూప దాస్ చెప్పారు. “ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ పిల్లల శారీరక పెరుగుదలకు మరియు మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. పిల్లల జీర్ణసంబంధ ఆరోగ్యానికి తోడ్పడడంలో డుఫాలాక్TM బేర్స్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన మరియు వినూత్న దశ, తద్వారా వారు చక్కని ఆరోగ్యాన్ని పొందడంతో పాటు, వారు ఆటపాటల్లో సంతోషంగా పాల్గొంటారు, ”అని ఆమె తెలిపారు.
పిల్లలకు దీర్ఘకాలిక గట్(చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు) ఆరోగ్య పరిష్కారం యొక్క ఆవశ్యకత గురించి అపోలో క్రెడిల్ హాస్పిటల్, పీడియాట్రిక్, HOD, డాక్టర్ సురేష్ కుమార్ చిడ్గుల్లా మాట్లాడుతూ, “టాయిలెట్ శిక్షణ సమయంలో ముగ్గురిలో ఒకరు మలబద్దకాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, పిల్లల గట్(చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు) ఆరోగ్యం తరచుగా పరిగణలోకి రాకపోవచ్చు. నా అనుభవంలో, తల్లిదండ్రులు పిల్లల మలబద్దకాన్ని చాలా ఆలస్యంగా గమనిస్తారు మరియు సాధారణంగా సహాయం కోరే ముందు ఒక నెల లేదా రెండు నెలలు ఇంటి నివారణ ఉపాయాలను అవలంబిస్తారు. స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన మరుగుదొడ్డి అలవాట్లను నెలకొల్పడానికి సకాలంలో మరియు నిరంతర చికిత్స ముఖ్యం. రుచికరమైన పిల్లల-స్నేహపూర్వక ప్రీబయోటిక్స్ మలబద్దకం నుండి ఉపశమనం పొందడమే కాకుండా, పిల్లలలో దీర్ఘకాలిక జీర్ణసంబంధ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ”
జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, వీటిలో కొన్ని జీర్ణసంబంధ ఆరోగ్యానికి కీలకమైనవి ఎందుకంటే అవి ఆహారప్రక్రియలో సహాయపడతాయి. ఈ “స్నేహపూర్వక” బ్యాక్టీరియా లాక్టులోజ్ వంటి ప్రీబయోటిక్స్ ద్వారా పోషించబడుతుంది, ఇది పిల్లలకు ఆరోగ్యకరమైన పేగు సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.