ఏపీలో టీడీపీకు సరైన అవకాశం వచ్చినట్టయింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలను తమకు కలసివస్తుందని అంచనా వేసుకుంటుంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడుకు టీడీపీ పగ్గాలు అప్పగించటం ద్వారా మరింత అచ్చొచ్చేలా మార్గం వేసుకోవాలనే పథక రచన చేస్తోంది. ఇటీవల కొద్దికాలంగా ఎంపీ రామ్మూర్తినాయుడు బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో ఉన్నంత యాక్టివ్‌గా కూడా రామ్మూర్తినాయుడు పార్టీ కార్యకలాపాల్లో ఉండలేకపోతున్నారు. బోలెడు రాజకీయ భవితవ్యం ఉన్న యువకుడుగా.. తన ప్లాన్ తనకు ఉన్నట్టుగానే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టు తరువాత మరింత సైలెంట్‌గా మారాడు. అందుకే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. రామ్మూర్తినాయుడు పార్టీ మారకుండా.. అచ్చెన్నాయుడు పేరును తెరమీదకు తెచ్చారనే ఊహాగానాలున్నాయి. ఏపీలో వైసీపీ బీసీలను నిర్లక్ష్యం చేస్తుందనే ఆరోపణలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అనువుగానే బాబు ఆలోచిస్తున్నారట.
ఏపీలో టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దాదాపు ఈ పేరుకు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. బీసీ నేతకు పీఠం అప్పగింటం ద్వారా ఏపీలో బలంగా పాగా వేయాలని భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కళా వెంకట్రావు టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన కూడా బీసీ నేతే. అయితే ఇటీవల అచ్చెన్నాయుడును ఈఎస్ ఐ స్కామ్‌లో నిందితుడుగా ఆఅరెస్టయ్యారు. ఏసీబీ విచారణ కూడా సాగుతోంది. మరో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది. గతంలోనూ కాపులను దగ్గరకు చేర్చుకోవటం.. రిజర్వేషన్ ఇప్పిస్తానంటూ బాబు హామీనివ్వటంతో బీసీలు దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. ఈ సారి కాపులు కూడా టీడీపీకు షాక్ ఇవ్వటం.. వైసీపీ, జనసేన, బీజేపీ వైపు మొగ్గుచూటంతో బాబు ఈ సారి బీసీలకే ప్రాధాన్యతనివ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ నెల 27వ తేదీ అచ్చెన్నాయుడు పేరును ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అచ్చెన్న అరెస్ట్‌తో పెరిగిన సానుభూతి కలసివస్తుందనేది టీడీపీ వ్యూహమట. ఈ లెక్కన అచ్చెన్నాయుడు రాకతో బీసీలంతా తమ వైపు చూస్తారని భావించటం వెనుక చంద్రబాబు ఆంతర్యం ఏమిటనేది కూడా
అంతుబట్టకుండా ఉందట.