3 కాదు.. 7 నెల‌లు యాంటీబాడీలు

క‌రోనా సెకండ్ వేవ్ రాబోతుంద‌నే భ‌యం ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతుంది. ముఖ్యంగా భార‌త్‌లో గుబుల‌కు కార‌ణ‌మైంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కొవిడ్‌19 పాజ‌టివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇండియాలో మాత్రం ఫిబ్ర‌వ‌రి, మార్చిలో క్ర‌మంగా మొద‌లై.. జులై నాటికి తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం 75 ల‌క్ష‌ల‌కు కేసులు చేరాయి. ప్ర‌తిరోజూ 70 వేల నుంచి 55 వేల‌కు త‌గ్గ‌టం కాస్త ఆనందాన్ని క‌లిగించే అంశం. అయితే.. శీతాకాలం ప్రారంభం కావ‌టంతో వైర‌స్ తేలిక‌గా వ్యాపిస్తుంద‌నేది వైద్యుల హెచ్చ‌రిక‌. న‌వంబ‌రు నుంచి 2021 మార్చి వ‌ర‌కూ ఏ మాత్రం నిర్ల‌క్ష్యంగా ఉండ‌వ‌ద్దంటున్నారు.

ఇక్క‌డే మ‌రో మెలిక దాగుంది. క‌రోనా ఎవ‌రికి వ‌స్తుంది. ఎందుకు సోకుతుంద‌నేందుకు ప‌క్కా ఆధారాల్లేవు. డీ విట‌మిన్ త‌గ్గిన వారిలో వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌నేది వైద్య‌ప‌రిశోధ‌న‌లు చెబుతున్న మాట‌. శ‌రీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవ‌టం, మాస్క్‌, సోష‌ల్ డిస్టెన్స్‌, శానిటేష‌న్ మూడు త‌ప్ప‌కుండా పాటించాల‌నేది ఇప్పుడున్న అస‌లు సిస‌లైన మందు.ఒక‌సారి వ‌చ్చిన వారికి మ‌రోసారి క‌రోనా వ‌స్తుందా! అంటే.. చెప్ప‌టం కూడా క‌ష్టంగానే ఉంది. వ‌స్తుంద‌ని చెప్ప‌లేక‌పోతున్నారు. రాద‌ని ధైర్యాన్ని నింప‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన వారిలో యాంటీబాడీలు త‌యార‌వుతాయి. అవి దాదాపు 3 నెల‌ల పాటు ఉంటాయ‌నేది ప‌రిశోధ‌న‌ల సారాంశం. సీసీఎంబీ చేసిన ప‌రిశోధ‌న‌లో యాంటీబాడీలు త‌గ్గినా.. మ‌రోసారి వైర‌స్ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తే నిద్రాణంలో ఉన్న యాంటీబాడీలు తిరిగి యాక్టివ్‌గా మారతాయ‌ని తేల్చిచెప్పారు. యాంటీబాడీలు పెరిగేందుకు.. వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు పుట్ట‌గొడుగులు ఉప‌యోగ‌ప‌డ‌తాయంటూ ఇటీవ‌ల సీసీఎంబీ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

తాజాగా అరిజోనా యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో యాంటీబాడీలులు 3 నెల‌లు కాదు.. ఏకంగా 7 నెల‌ల పాటు శ‌రీరంలో ఉంటాయంటూ తేల్చిచెప్పారు. సుమారు 6000 మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన వారిపై చేసిన అధ్య‌య‌నంలో దీన్ని గుర్తించారు. కొవిడ్ 19 పాజిటివ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారిలో యాంటీబాడీలు అత్య‌ధిక స్థాయిలో ఉత్ప‌త్తి అవుతున్నాయి. ఇవి 5 నుంచి నెల‌ల వ‌ర‌కూ ఉంటాయ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ అరిజోనా కాలేజ్ ఆఫ్ మెడిస‌న్‌కు చెందిన ఇమ్యూనాల‌జీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ దీప్తా భ‌ట్టాచార్య జ‌రిపిన ప‌రిశోధ‌న‌లు గుర్తించామ‌ని వెల్ల‌డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here