ఆహా.. అచ్చ తెలుగు సినిమా యాప్. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆలోచనకు రూపం. ఏడాది వ్యవధిలోనే ఎన్నో కొత్త సినిమాలు. వెబ్‌సీరిస్‌లతో వావ్.. అనిపిస్తోంది. ప్రీమియం కూడా తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అటు వైపు ఆసక్తిచూపారు. ఆహా.. ఓటీటీ అంటే.. మాదే అనే అనుభూతిని సొంతం చేసుకున్నారు. ఇటీవల కొత్తగా విడుదలైన కలర్‌పొటో సినిమా ఆహా ద్వారానే విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవటంతో ఆహా యాప్‌కు మరింత ఇమేజ్ వచ్చినట్టయింది. ఆహా ఓటీటీ వేదిక ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సినీ నటుడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా.. వ్యాఖ్యాతలుగా హర్ష, నవదీప్ సూపర్బ్ అనిపించారు. నటి తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్లున్నారు. 5 మిలియన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆహాలో మీరు ఎప్పుడు కనిపిస్తారంటూ.. నవదీప్ అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ తెలివిగా సమాధానమిచ్చారు. తప్పకుండా కనిపిస్తా.. మీ అందర్నీ సస్పెన్స్‌కు గురిచేస్తానంటూ చెప్పారు.
https://www.aha.video/