ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో హై స్పీడ్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించిన ఎయిర్‌టెల్
అత్యాధునిక ఎల్900 సాంకేతికత వినియోగించి 4జీ కోసం 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ మొహరించింది ; ఇది గణనీయంగా ఇండోర్ కవరేజీ సైతం పెంచనుంది
• సామర్థ్యం మరియు కవరేజీ వృద్ధి చేసేందుకు 10వేలకు పైగా సైట్స్‌ను 4జీగా ఆధునీకరించారు.
• 65.4 మెగా హెర్ట్జ్‌వద్ద,ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల వ్యాప్తంగా అతిపెద్ద స్పెక్ట్రమ్ బ్యాంక్‌గా నిలిచింది మరియు డాటా సేవల కోసం వేగంగా వృద్ధి చెందుతున్న డిమాండ్ ను సైతం తీర్చే చక్కటి స్థానంలో ఉంది
హైదరాబాద్, జూన్ 29,2021: భారతదేశపు ప్రీమియర్ కమ్యూనికేషన్స్ పరిష్కారాల ప్రదాత, భారతీ ఎయిర్‌టెల్ (ఎయిర్‌టెల్) నేడు తాము మరింతగా తమ హై స్పీడ్ డాటా నెట్‌వర్క్‌ను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల వ్యాప్తంగా ఆధునీకరించడం ద్వారా తమ వినియోగదారులకు అత్యుత్తమ నెట్‌వర్క్ అనుభవాలను అందించనుంది.
ఎయిర్‌టెల్ ఇప్పుడు 4జీ కోసం 4 MHz అత్యున్నతమైన 900 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లో తమ ప్రస్తుత స్పెక్ట్రమ్‌కు అదనంగా ఎక్స్ మెగాహెర్ట్జ్‌ను జోడించింది మరియు రెండు రాష్ట్రాలలోనూ 10వేల మొబైల్ సైట్లను 4జీకి అప్‌గ్రేడ్ చేసింది.
ఈ అదనపు విస్తరణ, గణనీయంగా సామర్ధ్యం విస్తరించడంతో పాటుగా ఇప్పటికే వినియోగదారుల కోసం మెరుగైన నెట్‌వర్క్ కలిగిన సంస్థను మరింతగా విస్తరించనుంది. తద్వారా నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లు మరియు భవంతుల లోపల కూడా మెరుగైన కవరేజీ అందిస్తుంది. ఈ విస్తరణతో ఎయిర్‌టెల్ ఇప్పుడు మరింత మెరుగైన కవరేజీని హైవేలు మరియు రైలు మార్గాలలో అందించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో సైతం తమ పాదముద్రికలను విస్తరించనుంది. తద్వారా మరింత మంది ప్రజలు హై స్పీడ్ డాటా సేవలను పొందగలరు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో అతిపెద్ద 65.4 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాంక్ ఎయిర్‌టెల్‌కు ఉంది. దీని యొక్క వైవిధ్యమైన స్పెక్ట్రమ్ 2100/1800/900/2300 బ్యాండ్స్ వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు హై స్పీడ్ డాటా సేవల కోసం వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను సైతం తీర్చే స్థానంలో ఉంది. ఈ సంవత్సరారంభంలో, విజయవంతంగా ప్రత్యక్ష 5జీ సేవలను హైదరాబాద్‌లోని తమ వాణిజ్య నెట్‌వర్క్‌పై ప్రదర్శించిన తొలి టెల్కోగా ఎయిర్‌టెల్ నిలిచింది.
అవ్నీత్ సింగ్ పురి, సీఈఓ– ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా, భారతీ ఎయిర్‌టెల్ మాట్లాడుతూ ‘‘అదనంగా ఎల్ 900 సాంకేతికతను విస్తరించడం ద్వారా మరింతగా ఇండోర్ కవరేజీ వృద్ధి చెందడంతో పాటుగా ఈ రెండు రాష్ట్రాలలోనూ ఎయిర్‌టెల్ యొక్క 4జీ స్పెక్ట్రమ్ బ్యాంక్‌కు మరింత శక్తి వస్తుంది. పోటీలో ముందుండటం కోసం మేము ఇటీవలనే లైవ్ 5జీ సేవలను హైదరాబాద్‌లో ప్రదర్శించాం. మా వినియోగదారులకు సంతోషం అందించేందుకు అత్యాధునిక నెట్‌వర్క్ సాంకేతికతలను విస్తరించేందుకు మేము చురుగ్గా పెట్టుబడులు పెడుతున్నాం’’ అని అన్నారు.
మహమ్మారి అనంతర కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ తరగతులు, వీడియో స్ట్రీమింగ్ పరంగా గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. అదనపు సామర్థ్యాలను నిర్మించడం కోసం ఎయిర్‌టెల్ చేస్తోన్న ప్రయత్నాలు వినియోగదారులు అనుసంధానితంగా ఉండేందుకు తోడ్పడటంలో ఎంతో దూరం వెళ్లనుంది.
ఎయిర్‌టెల్‌కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 3.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలలోనూ 97%మంది ప్రజలను ఈ నెట్‌వర్క్ చేరుకుంది.