ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటితే
ప్రతి పాఠశాల ఒక తోటవుతుంది
ప్రతి అక్షరం చెట్టుపైన దిద్దితే
అది ఒక పుస్తకమవుతుంది
చేయి చేయి మట్టిలో కలిపితే
ఒక పెద్ద వనమవుతుంది
వనం నుండి వీచే సమీరం
బతుకులకు ఆయువు అవుతుంది..
చెట్టుపైన కోకిల రాగంతో
మేఘం మురిసి మెరిసి వానను వర్షిస్తుంది
ప్రతి చెట్టు ఆకులు రాల్చుతుంది
కానీ ఈ చెట్టు అక్షరాలు రాల్చి
మాకు అక్షరాకలి తీరుస్తుంది
జ్ఞాన దాహం వేస్తే
అక్షర సుధను ధారగా పోస్తుంది..
విద్యార్థులు మారినా గురువులు మారినా మారనిది
స్వాగత వీడ్కోళ్ళు పలికేది
మాబడి అక్షర చెట్టు ఒకటే