ఇండియా-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. రోజురోజుకూ అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఏ క్షణాన ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది అంచనా వేయటం కష్టంగానే మారింది. ఇటీవల అమెరికా-ఇండియా సంయుక్తంగా జరిపిన సైనిక విన్యాసాలతో చైనా మరింత సీరియస్‌గా మారింది. గతేడాది గాల్వాన్ లోయ వద్ద హద్దు మీరిన చైనా భారత సైనికులు 21 మంది మందిని బలితీసుకుంది. ఆ తరువాత క్రమంగా అక్కడ పరిస్థితి తారుమారైంది. ఏడాది పాటు చర్చలు జరిపినా.. చైనా మొండిపట్టు వీడలేదు. రఫేల్ యుద్ధవిమానాలు దిగుమతి చేసుకున్న భారత్ వాటిని చైనా సరిహద్దుల్లో దించింది.
సముద్రజలాల్లో జలాంతర్గాములను మోహరించింది. 2 లక్షల మంది సైనికులను చైనా సరిహద్దుకు తరలించింది. చైనా కూడా ధీటుగా బలగాలను దించినా.. చైనా లిబరేషన్ ఆర్మీకు అనుభవం లేకపోవటం.. మంచుకొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. అక్కడ డ్యూటీ అంటే ఏడ్చేంతగా చైనా ఆర్మీ మారిందట. దీంతో తరచూ అక్కడ సైనికులను మార్చటం.. కూడా ప్రతికూలమైందట. ఇన్ని ప్రతికూలతో చైనా కాళ్లబేరానికి వచ్చినా.. నక్కజిత్తులతో సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, బంకర్లు, యుద్ధవిమానాలు, ట్యాంకులను రంగంలోకి దించుతుందట. దీంతో భారత్ కూడా అదనంగా 50,000 సైనికులను రెండ్రోజుల క్రితమే అక్కడకు పంపింది. రఫేల్ యుద్ధవిమానాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ సారి రక్షణగా నిలిచేలా గాకుండా.. అవసరమైతే సరిహద్దు దాటి చైనాకు గట్టి బుద్దిచెప్పేలా సైనిక బలగాలను భారత్ సిద్ధం చేయటం చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. అందుకే.. వక్రబుద్దితో పాకిస్తాన్ ద్వారా భారత్ ఆర్మీ స్థావరాలపై డ్రోన్ల దాడికి తెగబడుతున్నట్టు నిఘావర్గాలు అంచనా వేసుకుంటున్నాయి.