అవతార్ సినిమా గుర్తుందా.. ఎక్కడో వింతలోకంలో విహరించిన అనుభూతిని కలిగించిన సినిమా. ఇప్పటికీ టీవీలో ఆ సినిమా వస్తే.. పిల్లలు, పెద్దలు కదలకుండా కూర్చుంటారు. బాహుబలిని మించిన వండర్ మూవీ. జేమ్స్ కామరూన్ ఫిక్షన్ నుంచి వచ్చిన యాక్షన్ మూవీకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నాయి. కరోనా లేకపోతే.. ఇప్పటికల్లా థియేటర్లలో సందడి చేస్తుండేవి. కరోనాతో నాలుగు నెలల పాటు షూటింగ్ ఆపేశారు. దీంతో అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4 ,అవతార్ 5 ఇలా..మరో నాలుగు సీక్వెల్స్ ఆలస్యమవుతూ వచ్చాయన్నమాట. అవతార్ 2 దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. అవతార్ 3 కూడా 95శాతం సినిమా పూర్తయిందట. దీంతో కామెరూన్ సినిమా విడుదల తేదీలు ప్రకటించారు. అవతార్ 2 ( 2022 డిసెంబరు 16), అవతార్ 3 (2024 డిసెంబరు 24), అవతార్ 4 (2026 డిసెంబరు 18), అవతార్ 5( 2028 డిసెంబరు 22) విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇటీవల సమావేశంలో వెల్లడించారు. ఇదే విషయాలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా సినీ వర్గాలు వెల్లడించాయి. ఇంతకీ.. అసలు అవతార్ ఎప్పుడు రిలీజ్ అయిందో గుర్తుందా.. 2009 డిసెంబరు 10.