ఒకటీ రెండు కాదు. 28 ఏళ్లపాటు సాగిన విచారణ. 32 మంది కమలం అగ్రనేతలు. హైందవధర్మానికి అండగా నిలిచిన యోధులు. బాబ్రీమసీదు విధ్వంసం కేసులో సుదీర్ఘ విచారణలో వీరంతా నిర్దోషులుగా న్యాయస్థానం తేల్చింది. 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీమసీదును కూల్చివేశారు. ఆ నాడు పీఎంగా ఉన్న పి.వి.నరసింహారావు ఉండటంతో హిందువులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కేసు విచారణ సాగింది. 2001 మే 4న కేసు కొట్టివేశారు. ప్రతివాదులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ కేసు విచారణ ప్రారంభమైంది. దీనిలో బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కళ్యాణ్‌సింగ్, ఉమాభారతితో సహా 32 మంది నిందితులుగా ఉన్నారు. బుధవారం కోర్టు తుదితీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్కంఠత నెలకొంది. ఉదయం నుంచే బీజేపీతో సహా హిందుసంఘాలు టెన్షన్ వాతావరణంలో గడుపుతూ వచ్చారు. మధ్యాహ్న సమయంలో కోర్టు తుదితీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాలు లేని కారణంగా కేసు కొట్టివేసింది. 32 మందిని నిర్దోషులుగా న్యాయమూర్తి సురేందర్‌కుమార్ యాదవ్ వెల్లడించారు.
ఈ కేసులో సుమారు 2000 పేజీల తీర్పు వెలువరించారు. 351 సాక్ష్యాలు, 600 మంది సాక్షులను విచారించారు. ఇది పథకం ప్రకారం జరగలేదు. గుంపులో చేరిన కొన్ని అసాంఘికశక్తులు చేసిన పనిగా జడ్జి పేర్కొన్నారు. నేరం చేశారనేందుకు సరైన సాక్ష్యాలు సీబీఐ చూపలేపోయింది. సాక్ష్యాలుగా చూపిన వాటిలో ఆడియో/ వీడియోలను మార్ఫింగ్ చేశారు. బాబ్రీ విధ్వంసం కేసును సీబీఐ కోర్టు కొట్టివేయటంతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టారు. బాబ్రీ మసీదుకు కూడా ఐదు ఎకరాలు కేటాయించారు. డిసెంబరు 6వ తేదీ 1992లో లక్షలాది మంది హిందువులు బాబ్రీమసీదు వద్దకు చేరారు. అక్కడకు చేరిన వారిని అందుపు చేయటం పోలీసుల వల్ల కాలేదు. ఇంత విధ్వంసం వెనుక మురళీమనోహర్‌జోషి, అద్వానీ, ఉమాభారతి ఉన్నారంటూ అభియోగాలతో యూపీలో కేసు నమోదైంది. ఆ తరువాత సీబీఐ కేసు నమోదైంది. ఎన్నో విచారణలు. మార్పులు.. చేర్పులతో ఇన్నేళ్లు సాగింది. చివరకు జడ్జి సురేందర్‌యాదవ్ సరైన సాక్ష్యాలు లేవన్నారు. వీడియోలు, ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమన్నారు. కొన్ని అసాంఘికశక్తులు కావాలని బాబ్రీ కూల్చివేసిందన్నారు. నేరం చేశారనేందుకు ఎటువంటి ఆధారాల్లేవని, అభియోగాలను బలపరిచేలా ఎటువంటి సాక్ష్యాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ఇది చాలా సంతోషకరమైన తీర్పుగా ఎల్‌కే అద్వానీ ఆనందం వెలిబుచ్చారు. దీనిపై బీజేపీ శ్రేణులు, హిందు సంఘాల్లో సంతోషం పెల్లుబుకింది. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
49 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిలో 17 మంది మరణించారు. మిగిలిన 32 మందిపై విచారణ కొనసాగింది. వీరందరిపై మత ప్రసంగాలు, నష్టపరిచారనే , శాంతిభద్రతల విఘాతం తదితర అంశాలపై కేసు నమోదు చేశారు. గత ఎన్నికల్లో అద్వానీ పోటీ చేస్తారని భావించినా.. బాబ్రీ కేసు వల్ల బీజేపీ దూరం పెట్టిందనే గుసగుసలూ వినిపించాయి. కానీ వయోభారంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అకస్మాత్తుగా సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి విచారణ ప్రారంభించటంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ప్రతికూలంగా తీర్పు వస్తే.. ఈ వయసులో అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఆందోళన కూడా రేకెత్తింది. బుధవారం కోర్టు విచారణకు కరోనా సోకటం వల్ల ఉమాభారతి రాలేకపోయారు. వివిధ కారణాలతో 6 గురు రాలేదు. మిగిలిన 26 మంది వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి నెలకొన్నటెన్షన్ కు మధ్యాహ్నం తుదితీర్పుతో గొప్ప ఊరట లభించిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.