కూకట్పల్లి లోని ఉలవచారు బాంక్వెట్ హాల్ లో న్యూ వేవ్ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ తొలి బ్యాచ్ గెట్‌టుగెదర్ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరై, కాబోయే వైద్యులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా న్యూ వేవ్ కన్సల్టెన్సీ ద్వారా ఎంపికైన సుమారు 60 మందికి పైగా విద్యార్థులు, శంషాబాద్ విమానాశ్రయం నుండి కిర్గిజ్‌స్తాన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆసియా వైపు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ప్రధాన అథిథి బాబూ మోహన్ గారు మాట్లాడుతూ, వైద్యరంగంలో విద్యార్థులు భారత్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. ఆయన యువతకు క్రమశిక్షణ, కష్టపడి చదవడం, సమాజానికి సేవ చేయడం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వి.ఎస్. గణేష్ గారు మాట్లాడుతూ, తక్కువ బడ్జెట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల పూర్తి బాధ్యతను న్యూ వేవ్ కన్సల్టెన్సీ తీసుకుంటుందని గణేష్ గారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు కన్సల్టెన్సీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—