ఏ తల్లి కన్నబిడ్డడో.. ఇలా నాలా ఒడిలో శా శ్వతనిద్రలోకి వెళ్లాడు. కాప్రాలోని శుబోధయకాలనీ శ్రీ లక్ష్మినరసింహనగర్‌లోని నాలాలో 2 నెలల పసికందు మృతదేహం కనిపించింది. ఇంతకీ ఇ పసిగుడ్డు ఇక్కడకు ఎలా వచ్చాడనేది చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా చంపి పడేశారా.. లేకపోతే మరణించాక ఇలా వదిలేశారా! అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇటీవల ఆడపిల్ల పుట్టిందని పురిటిగుడ్డగా ఉన్నపుడే ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోతున్న తల్లులూ కనిపిస్తున్నాయి. చేసిన చీకటితప్పునకు ఫలితంగా భూమ్మీదపడిన పసికూనలను వదిలించుకునేందుకు హంతకులుగా మారుతున్నవారూ కనిపిస్తున్నారు. చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది అవాంఛిత గర్భాలతో హైదరాబాద్ చేరుతుంటారు. బిడ్డ పుట్టగానే అమ్మటమో.. ఎవరికైనా ఇవ్వటమో చేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అనాథగా వదిలేసిన బిడ్డలు.. రాబోయే రోజుల్లో అసాంఘికశక్తులుగా.. క్రిమినల్స్‌గా మారి దేశానికి చేటు చేస్తారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.