స్వర్గీయ డా. తులసీదేవి పోలవరపు మొదటి వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన
నందమూరి బాలకృష్ణ మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్యులు, సిబ్బంది
నేడు BIACH&RI వ్యవస్థాపకురాలలో ఒకరై హాస్పిటల్ ట్రస్టు బోర్డు సభ్యులుగా చనిపోయే వరకూ సేవలు అందించిన, అమెరికాలో స్థాపించబడిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ స్థాపకురాలు స్వర్గీయ డా. తులసీ దేవి పోలవరపు మొదటి వర్థంతి సందర్భంగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో దివంగత నేత సంస్మరణ సభ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI తో పాటూ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో ఉంచిన దివంగత డా. తులసీ దేవి పోలవరపు చిత్రపఠానికి పూల మాలలు అర్పించి నందమూరి బాలకృష్ణ తో పాటూ ఇతరులు దివంగత నేతకు నివాళులు అర్పిచారు.
అనంతరం కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ డా. తులసీ దేవి పోలవరపు సమాజానికి సేవ చేయాలన్న పడ్డ తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆమెను చిరస్మరణీయురాలుగా మిగిల్చాయని గుర్తు చేసుకొన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపన లోనూ స్వర్గీయ డా. తులసీ దేవి పోలవరపు సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగించాల్సిన భాద్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ వైద్యురాలిగా పేరు గడించిన డా. తులసీ దేవి తన మాతృభూమికి ఏదో చేయాలన్న తపనతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి విజయవంతమైనారని ఆయన కొనియాడారు. క్యాన్సర్ వైద్యుల కోసం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలోనూ గుంటూరు జిల్లాలలోని తన స్వగ్రామంలో విద్యా సంస్ధలు నెలకొల్పి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు.
మొదటి వర్థంతి సందర్భంగా బాలకృష్ణ స్వర్గీయ డా. తులసీ దేవి పోలవరపు కుటుంభ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రోగులు, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర సిబ్బందికి నందమూరి బాలకృష్ణ అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; జి రవి కుమార్, COO, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, అసోసియేట్ డైరెక్టర్ అకడమిక్స్, BIACH&RI లతో పాటూ పలువులు వైద్యులు, పారా మెడికల్, నర్సింగ్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.



