రామ్‌చరణ్.. మెగా అభిమానులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఎంపీ సంతోష్ తో కలసి మొక్కలు నాటిన చెర్రీ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దర్శకుడు రాజమౌళి, నటుడు ప్రభాస్, నటి అలియాభట్‌ను నామినేట్ చేశారు. ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తం మొక్కలు నాటాలన్నారు. ఇక తన ఫ్యాన్స్ ఒక్కొకరు.. 3 మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చారు.



