నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ పట్ల తిరుగులేని విధేయతకు మారుపేరుగా నిలిచిన అయ్యన్నపాత్రుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చింతకాయల విజయ్ ఒక ప్రముఖ యువ నేతగా వేగంగా ఎదుగుతున్నారు.
విజయ్ రాజకీయ ప్రయాణం ఆయన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. గతంలో ఎంపీగా అవకాశాలు వచ్చినా వ్యక్తిగత లాభాల కంటే పార్టీ నిర్ణయాలకే ఆయన పెద్దపీట వేశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో టెక్నాలజీ, సోషల్ మీడియాను ఉపయోగించుకుని కేడర్‌ను సమన్వయం చేయడంలోనూ, పార్టీ డిజిటల్ విభాగాన్ని బలోపేతం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆయనకున్న విద్యా నేపథ్యం, సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ అంశాలపై ఉన్న అవగాహనను గుర్తించిన నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ నాయకత్వం.. ఆయనకు రాజ్యసభ స్థానం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్‌కు జాతీయ స్థాయిలో అవకాశం కల్పించడం ద్వారా ఉత్తరాంధ్రలోని బీసీ వర్గాలకు సానుకూల సంకేతాలు పంపాలనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. విజయ్ ఎదుగుదల.. ఒక కుటుంబ నిబద్ధత, పార్టీ నమ్మకం, యువత సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది.



