ఒకరు అచ్చమైన తెలుగింటి కోడలు. మరొకరు.. హిందీ సినీరంగంలో తిరుగులేని హీరోయిన్. సమాజ సేవలో తాను కూడా భాగం కావాలని పరితపిస్తుంది. సొంత ఖర్చుతో ముంబైలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. మరొకరు.. డ్రగ్స్ గురించి దాని పరిణామాలపై చర్చిస్తుంది. కానీ.. ఆమె కూడా డ్రగ్ బాధితురాలే అని తేలింది. ఇలా.. కంగనా రనౌత్, నమ్రత, దీపికపడుకొణె, రియాచక్రవర్తి, సంజన, రాగిణి.. బాబోయ్.. వీళ్లంతా డ్రగ్స్ సరఫరా చేశారా.. వాడారా! అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ వీళ్లంతా బాధితులుగా నిర్ధారణైతే.. చికిత్స అందిస్తారు. కానీ.. డ్రగ్ రాకెట్‌లో వీరంతా సూత్రదారులుగా తేలితే. జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.
పూటకో టర్నింగ్. రోజుకో కొత్తపేరు. అందరూ హీరోయిన్లే. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్.. ప్రతి వుడ్‌లోనూ డ్రగ్స్ దందాయే. ఏదో సినీతారగా ఒక్క ఊపు ఊపేసి.. నలభై ఏళ్లు రాగానే అమ్మ కేరక్టర్‌లోకి వెళ్లామా! లేమా! అనే ఆ నాటి హీరోయిన్లు కాదు.. యాభై దాటాక.. హీరోలకేనా ఫోజులు. మేం కాదా! అంటూ ఐశ్వర్యారాయ్, కత్రినాకైఫ్ వంటి వాళ్లు స్లిమ్‌ఫిట్‌తో దూకుడు మీదున్నారు. అంతవరకూ డబుల్ ఓకే.. డ్రగ్స్ మత్తులో జోగుతూ.. రేయింబవళ్లు.. వీళ్లు సాగించిన వేషాలు.. వేషాల కోసం వీళ్లంతా నడిపిన డ్రామాలు నిజంగానే భారతీయతకు సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేతిలో ఉన్న జాబితాలో 25 మంది హీరోయిన్లు ఎవరనేది కూడా సస్పెన్స్. ఎంతమంది స్టార్లు.. సూపర్‌స్టార్‌లకు ఇవన్నీ మెడకు చుట్టుకోవటం ఖాయమనేది కూడా ఇండస్ట్రీ టాక్ తారలు రకుల్‌ప్రీత్‌సింగ్, దీపికా పడుకొణే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ మూడు రోజుల్లో హాజరుకావాలని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) నోటీసులు జారీచేసింది.
ఇదేమీ ఇప్పుడు కొత్త కాదు.. ఆ నాడు మమతాకులకర్ణి, మోనికాబేడీ వంటి హీరోయిన్ల కెరీర్‌ను కూడా డ్రగ్స్ నాశనం చేశాయి. వీరిద్దరి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ఉన్నాడనే ఆరోపణలు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ముంబై డ్రగ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఇవేమీ కొత్తకాదు. నాడు సంజయ్‌దత్ కూడా వీటి బాధితుడే. తెలుగు సినిమా నటుడు బానుచందర్ కూడా కుర్రోడుగా ఉన్నపుడు డ్రగ్స్ బానిసై తరువాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని బయటపడ్డానంటూ చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఛార్మి, ముమైత్‌ఖాన్‌లపై మూడేళ్ల క్రితమే డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. పూరీ జగన్నాథ్ పుణ్యమాంటూ థాయ్ లాండ్ బ్యాచ్‌లో వీరు కూడా మత్తుకు బానిసలయ్యారనే గుసగుసలూ లేకపోలేదు. ఆ కేసు విచారణ కూడా పక్కదారిపట్టినట్టుగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో లభించింది. తాజాగా తెలుగు హీరోయిన్ పేరు బయటకు వచ్చినా ఆమె కోర్టు ద్వారా తన పేరు చెప్పకూడదంటూ అనుమతి తెచ్చుకుని పరువు కాపాడుకునే పనిలో పడిపోయింది. ఒకప్పటి అందాల సుందరి.. మిస్ ఇండియా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రతాశిరోద్కర్ పేరు బయటకు రావటం సంచలనంగా మారింది. దియామిర్జాతో ఆమె జరిపిన ఛాటింగ్ వెలుగు చూడటంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఉలికిపాటుకు గురైంది. ఇప్పటికే తనీష్, నవదీప్, తరుణ్ , నందు వంటి హీరోల పేర్లు డ్రగ్స్ వాడకం జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు నమ్రత పేరు బయటకు రావటంతో ఇంకెంతమంది హీరోయిన్ల పేర్లు వెలుగు చూడబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్‌లో సుశాంత్‌సింగ్ సూసైడ్ తరువాత డ్రగ్ రాకెట్ వెలుగు చూసింది. రియాచక్రవర్తితో మొదలైన హీరోయిన్ల జాబితాలో దియామిర్జా, దీపికాపడుకొణే, నమ్రత, రాగిణి, సంజన ఒక్కొక్కరుగా డ్రగ్స్ వాడినట్టుగానో.. విక్రయించినట్టుగానో వెలుగులోకి వస్తున్నారు.