అమెరికాలో కరోనా కేసులు 66 లక్షలు.. బారత్‌లో అరకొటి. కొద్దిరోజుల్లో అమెరికాను దాటి మొదటి స్థానానికి చేరుతామనే ఆందోళన కూడా ఉంది. దీనికి ప్రభుత్వాలను నిందించటం కంటే.. ప్రజలే స్వీయనియంత్రణ పాటించాలంటున్నారు నిపుణులు. ఇలాగే వదిలేస్తే.. రాబోయే శీతాకాలం మూడు నెలలు మరింత నరకాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అన్‌లాక్4.0 కేవలం మనుషులకే వైరస్ కాదంటోంది. 9 నెలల్లో అరకోటి కొవిడ్19 పాజిటివ్ కేసులు దాటాయి. ఇక్కడ మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. 60 శాతం మంది యువత ఉంటున్నారు. 70శాతం మందిలో లక్షణాలు కూడా కనిపించట్లేదు. దీనికి కారణం.. నిర్లక్ష్యం.. స్వేచ్ఛగా రోడ్ల మీదకు రావటం.. ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా ఉండటమేనంటూ వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఉంటే. భారత్‌లో కేవలం రాబోయే మూడు నెలల్లో కోటి కేసులు వరకూ చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటివి కూడా ఆందోళన చెందుతున్నాయి.
అమెరికా 66 లక్షల కేసులున్నాయి. సుమారు 2 లక్షల మంది మరణించారు. ఆ తరువాత రెండోస్థానం ఉన్న భారత్‌లో ప్రస్తుతం 50,20,360 కేసుల వరకూ చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 9,95,933 మంది ఉన్నారు. మిగిలిన దేశాలతో పోల్చితే ఇండియాలోనే రికవరీ రేటు అధికంగా 70శాతం వరకూ ఉంది. మరణాల రేటు కూడా కేవలం 2శాతం కంటే తక్కువే. 1.63 శాతం మరణాలు నమోదుతున్నాయి. అయినా ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదంటున్నారు పరిశోధన సంస్థలు. తాజాగా కేంద్రం 2021 మార్చి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్రం కూడా ప్రకటించింది. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం రెండేళ్లు, ఐదేళ్లు కూడా అందరికీ వ్యాక్సిన్ చేరేందుకు సమయం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఒకేరోజు 1290 మంది మరణించటం కూడా సరికొత్త రికార్డ్. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 5.94కోట్ల మందికి కరోనా వైద్యపరీక్షలు చేశారు. కొవిడ్ నుంచి బయటపడిన వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇటీవల ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి ఏదైనా.. అనారోగ్య సమస్యలు ఎదురైనపుడు మందులు వాడమని సూచించింది. ఏమైనా.. ప్రజల్లో నిర్లక్ష్యం.. రేపటి ఆరోగ్య భారతావనికి పెను ప్రమాదం అనేది శాస్త్రవేత్తల సూచన. ముఖానికి మాస్క్, చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం, గుంపులకు దూరంగా.. వ్యక్తిగత దూరం పాటించటం.. పెద్దగా ఖర్చులేని ఈ మూడు సూత్రాలు.. జీవితాన్ని నిలబెట్టే వరాలుగా వివరిస్తున్నారు. పాటించటమో.. వదిలేయటమో అనేది ప్రజల చేతిలోనే ఉందంటున్నారన్నమాట.



