మహారాష్ట్రలో 2020లో 19 లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులు.. 2021 నాటికి అవి 40 లక్షలకు చేరాయి. రాబో్యే 3-4 వారాల్లో మూడో వేవ్ రాబోతుందంటూ అక్కడి టాస్క్‌ఫోర్స్ ఆందోళన వెలిబుచ్చింది. రెండో వేవ్‌లో ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రాల్లో మహా రాష్ట్ర ఒకటి. ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 3 రోజులుగా జనాలు కూడా రోడ్లమీదకు చేరారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మూడోవేవ్ పై డాక్టర్ జోషి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ అంచనా వేసింది. మూడో వేవ్ రాబోతుందంటూ హెచ్చరించింది. యూకేలో కూడా ఇదే తరహాలో మూడో దశ తీవ్రంగా విరుచుకుపడింది. డెల్టా వేరియంట్ చూపిన దెబ్బకు ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. ఇప్పుడు అదే పరిస్థితి.. అదే డెల్టా వేరియంట్ మహారాష్ట్రకు ముప్పుగా మారిందంటూ తెలిపింది. దీంతో అక్కడి యంత్రాం గం అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు సన్నద్ధమైందట. మరి.. పక్కనే ఉన్న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లు కూడా దీంతో అప్రమత్తం కావాల్సింది. రెండో దశ తెలంగాణపై ఎక్కువగా ఎఫెక్ట్ కావటానికి ఓ విధంగా మహారాష్ట్ర బోర్డర్‌ను కట్టడి చేయకపోవటమే అనేది బహిరింగ రహస్యం. ఈ దఫా ముందస్తుగా మేలుకోకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది మహారాష్ట్ర టాస్క్‌ఫోర్స్ నివేదిన చెబుతున్న నిజం.