అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతా తుమ్మాల్సిందే అనే సామెత. కరోనాతో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. అదెలా అంటారా.. అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. చాలామంది అమెరికన్లు కూడా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్ల మాటలు నమ్మట్లేదట. ట్రంప్‌కు కొవిడ్19 పాజిటివ్ అనే విషయాన్ని ఒకరోజు గోప్యం గా ఉంచారు. తరువాత మిలట్రీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వచ్చారు. వరుసగా రెండుసార్లు ఆక్సిజన్ లెవల్స్ తగ్గటంతో ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఇప్పటికీ ట్రంప్ ఆరోగ్యంగా ఎలా ఉందనేది ప్రశ్నగానే మిగిలింది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం ఆ దేశ శాంతిభద్రతలతో ముడిపడిన అంశం.
అందుకే.. అగ్రరాజ్యాదినేత విషయంలో అమెరికా చాలా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ట్రంప్ హెల్త్ చాలా క్రిటికల్‌గా ఉందనేది మాత్రం వాస్తవం. అయినా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి వైట్‌హౌస్‌కు తరలించటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తిని అందులోనూ 74 ఏళ్ల వృద్ధుడిని అలా వదిలేయటంపై కూడా ఆందోళన లేకపోలేదు. ఏమైనా అమెరికా అధ్యక్షుడుకి కరోనా సోకిన తరువాత చైనా విషయంలో ధోరణి మరింత మారింది. అధ్యక్షుడికి ఏదైనా ముప్పు వాటిల్లితే పరిస్థితి ఇంకెంత చేజారుతుందనేది విశ్లేషకుల అంచనా. కట్టుదిట్టమైన భద్రత.. ఎన్నో జాగ్రత్తలు.. అత్యాథునిక వైద్యసదుపాయాలున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నే వదలని కరోనా వైరస్‌తో సామాన్యులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా అర్ధం చేసుకోవాలంటున్నారు వైద్యనిపుణులు.
ఒడిషా మాజీ మంత్రి ప్రదీప్ మహంతి. యూపీ మంత్రి కమలారాణి, ఏపీలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం.. మాజీ మంత్రి ద్రోణంరాజు శ్రీనివాస్, మాణిక్యాలరావు కరోనా వైరస్ బారీనపడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కొవిడ్19 పాజిటివ్ గా చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా వైరస్ భారీన పడి ఆసుపత్రిలో ఐటీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. సినీ నటి తమన్నా కూడా ఆసుపత్రిలో చేరారు. ఇలా.. సామాన్యుడి నుంచి ఉన్నోడి వరకూ అందరినీ కదిలిస్తూ.. కబళిస్తున్న కరోనా మున్ముందు మరింత డేంజర్‌బెల్స్ మోగించేందుకు సిద్ధంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో లక్ష మంది కరోనా భారినపడి మరణించారు. రోజుకు 80,000 కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 21-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 60శాతం ఉంటున్నారు.
హైదరాబాద్‌లోని సీసీఎంబీ చేసిన పరిశోధనలు కూడా వైరస్ ముప్పు ఎంతగా పొంచి ఉందనేది చెబుతోంది. కరోనా గాలి, నీరు, వాతావరణం ఎలా వ్యాపిస్తుంది. అసలు మనిషి నుంచి మరో మనిషికి వైరస్ చేరేందుకు ఉన్న అవకాశాలు ఏమిటీ అనేది ఇప్పటి వరకూ పరిశోధనలకూ అందకుండా ఉంది. ఎవరికి వారే.. తమ ప్రయోగాల్లో గుర్తించిన అంశాలను మాత్రమే బహిర్గతం చేస్తు న్నారు. ఇదే శాస్ర్తీయమైనది అని మాత్రం నిర్ధారించలేకపోతున్నారు. సీసీఎంబీ పరిశోధన ప్రకారం గాల్లో ఉన్న వైరస్ 24-72 గంటలు పాటు ఉంటుంది. పైగా రాబోయేది శీతాకాలం ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా స్వేచ్ఛగా వైరస్ చేరుతుంది.
వైరస్ వచ్చి తగ్గిన వారిలో ఒకరమైన ధీమా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అది ఏ మాత్రం మంచిదికాదని హెచ్చరిస్తున్నారు. వైరస్‌తగ్గినా దానితాలూకూ దుష్ఫలితాలు 2-5శాతం మందిలో కనిపిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ చికిత్స తీసుకున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రెండోసారి వైరస్‌కు గురవుతారా! లేదా! అనేది ఇప్పటికీ అంతుబట్టకుండా ఉంది. సీసీఎంబీ అధ్యయనం ప్రకారం ఒకవేళ రెండోసారి కరోనా ఒంట్లోకి చేరినా అప్పటికే శరీరంలో ఉన్న యాంటీబాడీస్ మళ్లీ నిద్రావస్త నుంచి మేల్కోంటాయని భరోసానిస్తున్నారు. కానీ రోగనిరోధకశక్తి తగ్గకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారే చూసుకోవాలని సూచిస్తున్నారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలలి. వ్యక్తిగతదూరం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విందులు, వినోదాలకు వెళ్లకుండా ఉండాలని మరీ చెబుతున్నారన్నమాట.
మనిషి బయటకు భేషజంగా మట్లాడడం అనాదినుంచి వస్తున్న అలవాటు. లోపలి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. అలాగే ట్రంప్ గారు కూడా ఒక మనిషే కదా! ఎంత పైకి గాంభీర్యం చూపించినా మహమ్మారి ప్రభావానికి తలొగ్గాల్సి వచ్చింది. భగవంతుడు ఆయనకు త్వరగా స్వస్థతనిచ్చి ప్రజలలో భయాందోళనలను తగ్గించాలని ప్రార్థిద్దాము. మీరు ప్రచురించిన ఈ వ్యాసం అందరికి శ్రేయోదాయకం. అంత వాడే రుగ్మత బారిన పడ్డాడు అంటే మనం ఎంత జాగ్రత వహించాలి అనే అవగాహన మనలో పెరుగుతుంది. మంచి విషయం ప్రచురించినందుకు ధన్యవాదాలు. బి. జగన్నాథాచార్యులు
You said correct Sir
Thanks for your appreciation.
– http://www.kadhalika.in Team