కరోనా వైరస్ ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా.. పేరు వినగానే ఒకింత ఒళ్లు వణకుతూనే ఉంటుంది. కరోనా రాజకీయంగా కూడా బాగానే వర్కవుట్ అయింది. పోన్లే కాసేపు అవన్నీ పక్కనబెడితే.. అసలీ కరోనా ఎంతమందికి వచ్చిందనే లెక్కలే లేవు. ఇంకెంతమందికి తగ్గిందంటే నోరెళ్లబెట్టాల్సిందే. సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మందికి వైరస్ సోకి తగ్గిన సంగతి కూడా తెలియదంటూ తేల్చిచెప్పారు. ఏపీలో తాజాగా సీరో సర్వైలెన్స్ అనే సంస్థ కరోనా పై సర్వే చేసింది. 13 జిల్లాల్లో చేసిన సర్వే రెండు దశల్లో ముగించింది. ఆ సర్వే లెక్కల ప్రకారం.. ఏపీలో 19.07శాతం మందికి కరోనా వచ్చి తగ్గిపోయింది. వీరిలో పురుషులు 19.05శాతం, మహిళలు 19.0శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 18.02శాతం కాగా.. పట్టణ, నగరాల్లో మాత్రం 22.05శాత మంది ఉ్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఆ సంఖ్య 20.05శాతం ఉందన్నమాట. కంటైన్‌మెంట్ కాని చోట్ల కరోనా వైరస్ భారిన పడి తగ్గిన వారి సంఖ్య 19.03శాతమట. మరో విషయం ఏమిటంటే.. కరోనా తగ్గిన వారిలో 20.03 శాతం ప్రమాదకర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయట.
కరోనా వైరస్ ఎలా దాడిచేస్తుంది.. వైరస్ తగ్గాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయా! అంటే చూద్దామంటూ వైద్యులు సమాధానమిస్తున్నారు. ప్రముఖ వైద్యులు చెబుతున్న మాట ఒక్కటే.. కరోనా తగ్గిందని సంబరం వద్దు.. తిరిగి రాదనే భరోసా కూడా లేదంటున్నారు. కాబట్టి.. ఏతా.వాతా వాళ్లు చెప్పేది ఒక్కటే.. వైరస్ ఒంట్లోకి చేరి లక్షణాలు లేని వారితో అసలు సమస్య. ఇలాంటి వారి వల్లనే వైరస్ మహమ్మారి బాగా వ్యాపిస్తుందట. అందుకే.. ఏ మాత్రం శరీరంలో తేడా అనిపించినా వ్యక్తిగతదూరం, మాస్క్ ధరించటం తప్పనిసరి అంటూ సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండో ట్రయల్స్‌లో ఇబ్బంది ఏర్పడింది. వ్యాక్సిన్ ఇచ్చిన ఒక వ్యక్తికి తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో మళ్లీ వ్యాక్సిన్‌పై సందేహం నెలకొంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండోట్రయల్స్‌కు రంగం సిద్ధమైంది. మరోవైపు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీకు ఇండియాలో రెండు ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పరిస్థితులను బట్టి అర్ధం చేసుకోవాల్సి ఏమిటంటే. ఎవరి ఒంటిని వాళ్లే కాపాడుకోవాలన్నమాట.