ఎస్.. ఇండియా అంటే నమ్మకం. భారత్ అంటేనే భరోసా. ఇదే ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది. చైనా నుంచి సవాళ్లు.. పాక్ నుంచి దాడులు ఎన్ని ఎదురైనా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవటంలో భారతదేశం ఎంత చురుగ్గా ఉందనేది ప్రపంచం గుర్తించింది. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జన్ కరోనా టీకాకు డిమాండ్ పెరిగింది. ఇటీవలే స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశోధనలను పరిశీలించి వెళ్లారు. దీంతో భారత్ బయోటెక్‌లో రూపుదిద్దుకుంటున్న వ్యాక్సిన్ కొవాగ్జిన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ వందలాది వ్యాక్సిన్‌లు తయారు చేసి 300కు పైగా దేశాలకు సరఫరా చేస్తోంది. ఇప్పుడు అదే భరోసాతో కొవాగ్జిన్ టీకాను పరిశీలించేందుకు సుమారు 80 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు బుధవారం జినోమీ వ్యాలీ వచ్చారు. ఇప్పటికే 61 దేశాల ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. సుమారు 40 కోట్ల వ్యాక్సిన్‌లను తయారు చేసేందుకు భారత్ బయోటెక్ సిద్ధమైంది. ఈ లెక్కన కొత్త ఏడాది అంటే.. 2021 జనవరిలోనే కొవాగ్జిన్ టీకా వేసేందుకు ప్రణాళిక రెఢీ అవుతుంది. అంటే.. కేవలం ఒక్కో వ్యాక్సిన్ రూ.250 లోపు ఇచ్చేందుకు భారత్ సిద్దమైందట. ఇదే జరిగితే.. భారతీయులకు కరోనా భయం తొలగినట్టే.. భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి చాటినట్టు కూడా అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.