సిక్సర్ల నుంచి ఎగ్స్ వైపు వస్తున్నాడీ కెప్టెన్. హెలికాప్టర్ షాట్లతో విసుగెత్తిన క్రికెటర్ మాజీ కెప్టెన్ కోళ్ల పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నారు. అది కూడా.. సాధారణ కోళ్లు కాదండోయ్. నల్లకోడి.. వీటినే కడక్‌నాథ్ కోళ్లుగా పిలుస్తుంటారు. ఒకప్పుడు అటవీప్రాంతంలో పెరిగే వీటిని ఐదారేళ్లుగా.. వ్యాపారంగా మార్చేశారు. కోడిగా కనిపించే ఇవి సాధారణ కోళ్లుగా ఉండవండోయ్.. రూపం నలుపు.. నెత్తురు నలుపు. గుడ్డు మాత్రం తెల్లగానే ఉంటుందండోయ్. అయితే.. దీనిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బోలెడంత ప్రోటీన్ కూడా లభిస్తుంది. అంతేనా.. ఎన్నో రకాల జబ్బులకు ఔషదంగా కూడా ఉపయోగపడుతుందట. ఇప్పటికే రెండుతెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో రైతులు కడక్‌నాథ్ కోళ్లను పెంచుతూ .. లక్షలాది రూపాయల ఆదాయం పొందుతున్నారు. దీని ధర కూడా చాలా ఎక్కువే. సహజంగా దొరికే వాటిని తింటుంటుంది. కిలో ధర రూ.500-600 వరకూ పలుకుతుంది. గుడ్డు ధర కూడా రూ.30కు పై మాటే. కొవ్వు ఉండదు.. పైగా గుండెజబ్బులు, షుగర్ ఉన్నవాళ్లు కూడా ఎంచక్కా తినొచ్చంటున్నారు వైద్యులు. ఇలా ఎన్నో మంచి లక్షణాలున్న నల్లకోడికి మాంసాహారులు ఎగబడి మరీ కొంటున్నారు. రుచికరంగా వండుకుని మరీ ఆరగిస్తున్నారు. అందుకేనేమో.. క్రికెట్ వదిలాక.. తన ఫామ్‌హౌస్‌లో ఫౌల్ట్రీఫారం ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 2000 కోళ్లకు ఆర్డర్‌కూడా ఇచ్చారట. వ్యవసాయం అంటే ఇష్టపడే ధోనీ ఇప్పటికే తన పొలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వాటితో సహవ్యాపారంగా నల్లకోడికి జై కొట్టారన్నమాట.