“ఏంటో అంతా సరికొత్తగా” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు సైలేష్ కొలను

“రాము ప్రొడక్షన్స్” బ్యానర్‌పై రూపొందుతున్న “ఏంటో అంతా సరికొత్తగా” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సైలేష్ కొలను చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సైలేష్ కొలను మాట్లాడుతూ… “పోస్టర్ చూడగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

రాజ్ బోను గారు కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన కథ చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాను. రాము గారు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను,” అని తెలిపారు.

ఈ చిత్రానికి రాజ్ బోను కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్నారు. రాము.ఎం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం రిషి.ఎం, సినిమాటోగ్రఫీ వేణు కొత్తకోట, ఎడిటింగ్ హరీష్ జె.ఆర్ కృష్ణ అందిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు సాయి సూర్య రావూరి, ఆర్ట్ వెంకట్ మేడిశెట్టి, ఫైట్ మాస్టర్ అంజి, లిరిక్స్ భాస్కర్ బట్ల, రాకెందు మౌళి, అనిరుద్ శాండిల్య, స్టిల్స్ ప్రేమ్ కోట, పబ్లిసిటీ డిజైనర్ ఏ జె ఆర్ట్స్ అందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక నూతన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని, ప్రేక్షకులకు పూర్తి వినోదంతో పాటు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు

Previous article“ఆరాధ్య” చిత్రం నుండి మనసుని హత్తుకునే ‘నీ పుట్టుకే ఓ వరం’ సాంగ్ లాంచ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here