పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ’ఎవోల్’ (EVOL)

సూర్య శ్రీనివాస్‌, శివ  బొద్దురాజు, జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్‌’. ((EVOL) a love story in reverse  ) రామ్‌యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది.

దర్శక నిర్మాత రామ్‌యోగి మాట్లాడుతూ ‘‘ఇద్దరు స్నేహితుల మఽధ్య అండర్‌స్టాండింగ్‌, నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్‌ జానర్‌ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిఈక్రరణ జరిపాం. ఆర్టిస్ట్‌లంతా చక్కగా సహకరించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు వెళ్లనుంది. త్వరలో ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నమిది. అందరి ఆదరణ కావాలని కోరుతున్నా’’ అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
కెమెరా: తేడా బ్యాచ్‌ సినిమా టీమ్‌,
ఎడిటర్‌: విజయ్‌,
ఆర్ట్‌: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్‌: జిన్నా
పీఆర్వో: మధు విఆర్
కథ–స్ర్కీన్‌ప్లే–మాటలు–నిర్మాత–దర్శకత్వం: రామ్‌ యోగి వెలగపూడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here