ఇటీవల కరోనా నుంచి బయటపడి.. న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరిన మాజీ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాయిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ హోమంత్రి నాయినికి ఇటీవలే కరోనా సోకింది. తగ్గిన తరువాత ఇంటికి వెళ్లారు. ఇంతలోనే వైరస్ ప్రభావంతో ఊపిరితిత్తులు దెబ్బతినటంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారానే వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.