బార్య‌భ‌ర్త‌ల్లో ఎవ‌రి లోపంతో పిల్ల‌లు పుట్ట‌రంటే..??

చాలామంది దంపతులకు ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారని కామినేని ఫెర్టిలిటీ డిప్యూటీ సిఒఒ డైరెక్టర్ డా గాయత్రి కామినేని తెలిపారు. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణం అని అన్నారు. 2011వ సంవత్సరంలో కింగ్ కోఠిలో మొదటి కామినేని ఫెర్టిలిటీ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు దాదాపు 3000లకు పైగా జంటలు సంతానాన్ని పొందడంలో సహాయపడి వారి జీవితాలలో సంపూర్ణమైన ఆనందాన్ని తెచ్చానన్నారు. కామినేని ఫెర్టిలిటీ తన నెట్వర్క్ కేంద్రాల విస్తరణను వేగవంతం చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది మరియు ఇప్పటికే వాటిలో రెండు ఏర్పాటు అవుతున్నాయన్నారు.

అంతర్జాతీయ మరియు యూరోపియన్ ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. అత్యంత అధునాతన ఎఆర్టి ఎంబ్రియాలజీ ల్యాబోరేటరీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ చేయబడిన తెలంగాణలోనే మొట్టమొదటిదైన ఎల్126 ఎమ్పి వర్క్స్టేషన్, హైరిజల్యూషన్ స్టీరియో మైక్రోస్కోప్, సిఒడిఎ టవర్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్, అండ్రోలజీ ల్యాబ్, పిజిడి ల్యాబ్ మరియు సమగ్ర సంతాన సమస్య సంరక్షణను సులభతరం చేయడానికి అధునాతన ప్రీజింగ్ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోవడం జరిగిందన్నారు.

కామినేని ఫెర్టిలిటీ ప్రతి జంట యొక్క ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ ప్రోటోకాల్ను అనుసరించడంతో పాటు ప్రపంచంలోని ఉత్తమమైన వాటితో సమానంగా అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది. నగరంలోని కోకాపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫెర్టిలిటీ కేంద్రం సంతానలేమి సమస్యతో అధికంగా బాధపడుతున్న యువత సమస్యను తీర్చగలదని కామినేని డిప్యూటీ సిఒఒ డైరెక్టర్ డా॥గాయత్రి కామినేని అన్నారు. గర్బాధారణ చేయడానికి పెళ్లయ్యి రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పట్టినట్లయితే, గర్బం దాల్చడానికి ఆలస్యం కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి దంపతులు ఆలోచన చేయాలి. సంతానలేమి అనేది కేవలం స్త్రీకి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అది పురుషుడిలో కూడా లోపం కావచ్చు. 30 నుండి 35% కేసులు మగవారిలో లోపం వలన సంతానలేమికి కారణం కావచ్చు. 20 నుండి 25% వరకు పురుషుడు మరియు స్త్రీలలో ఇద్దరిలో లోపం కారణంగా సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు మరియు మిగిలినవి స్త్రీ మూలకంగా సంతానలేమి సమస్యకు కారణం కావచ్చు. కరోనా మహమ్మారి కారణంగా చికిత్స అందుకునే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకంటే ప్రజలు హాస్పిటల్స్ను సందర్శించాలని కోరుకోవడం లేదు, ముఖ్యంగా కొత్త రోగులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే చికిత్స ప్రారంభించిన వారు తమ తమ షెడ్యూల్ ప్రకారం వెళ్లి చికిత్సను కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు.

కామినేని ఫెర్టిలిటీలోని ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్లకు అంతర్జాతీయ అనుభవంతో పాటు తాజా మరియు అత్యాధునిక ఇన్ఫెర్టిలిటీ పద్దతులలో మంచి అనుభవం కలిగి వున్నారు. ఆపరేటివ్ లాపరోస్కోపిక్ మరియు హిస్టెరోస్కోపి, అల్ట్రాసౌండ్, స్కాన్లు మరియు అల్ట్రాసౌండ్ గైడెడ్ శస్త్ర చికిత్సా విధానాలు, అండోత్పత్తి ప్రేరణ, ఇంట్రాటరైన్ ఇన్సిమినేషన్ (బయాలు), ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) ఐసిఎస్ఐ (ఇంట్రాసిక్టోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) ఫ్రీ – ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పిజిడి), ఫ్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ (పిజిఎస్), ట్యూబల్ రీక్యానలైజేషన్ మరియు తరచుగా గర్భస్రావాలు సంభవించే వారికి చికిత్స వంటి అత్యాధునిక చికిత్సలు అందిస్తున్నామన్నారు.

నానాటికీ సంతానలేమి సంఘటనలు పెరుగుతూ మరీ ముఖ్యంగా తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగించే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించవలసి ఉన్నది. మారుతున్న జీవనశైలి. మానసిక ఒత్తిడి, పని ఒత్తిళ్లు పెరిగిపోతున్న కాలుష్యం మరియు ఇతర సమస్యల కారణంగా అనేక జంటలు జీవితంలో తల్లిదండ్రులయ్యే మధురానందానికి దూరం అవుతున్నారు. ప్రస్తుత సవాళ్ల సమయంలో సంతానలేమి సమస్య సంరక్షణలో గొప్ప సాంకేతిక పురోగతి ఒక ఆశాకిరణంగా ఉన్నది. కామినేని ఫెర్టిలిటీ సాంకేతికత మరియు చికిత్సలలో నూతన పరిణామాలను వేగంగా అమలు చేస్తూ, ఇక్కడ అవసరమైన వారికి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. మరింత సమాచారానికి సంప్రదించండి: 9959154371

Previous articleఈ కరోనా ఎన్నో పాఠాలు నేర్పింది
Next articleపాపం అంబ‌టి ఇప్ప‌టికి త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుందీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here