FNCC లో ఘనంగా ఉగాది సంబరాలు

ఉగాది పండుగ సందర్భంగా ఫిల్మ్నగర్లోని FNCC లో వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఈ ఉగాది సంబరాలకు హోస్టుగా చేసారు. సింగర్ శ్రీ లలిత & గ్రూప్ మ్యుజికాల్ మెలడీస్ తో, వారి గాత్రంతో అందరిని అలరించారు.

ఈ సంబరాలకు FNCC ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగా రావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ వి.వి.ఎస్.ఎస్. పెద్ది రాజు గారు, ట్రేషరర్ బి. రాజ శేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబెర్స్ రాజా సూర్యనారాయణ గారు, కె. మురళి మోహన్ రావు గారు, శ్రీమతి శైలజ గారు, జే. బాల రాజు గారు, ఏ. గోపాలరావు గారు, ఏడిద రాజ గారు, మోహన్ వడపట్ల గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, వర ప్రసాద్ రావు గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కలిసి జ్యోతి ప్రజర్వాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఈ కార్యక్రమ అనంతరం FNCC ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు గారు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తరవాత పంచాంగ శ్రవణం మిగతా సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది సంభరాలు FNCCలో ఘనంగా జరిగాయి.

Previous article‘లవ్ మోక్టైల్ 2’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ విడుదల
Next article“సఃకుటుంబానాం” సినిమా ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన యూనిట్ సభ్యులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here