పుర్రెకో బుద్ది.. జివ్హకో రుచి ఊరకే అనలేదు పెద్దలు. ఆధునికత ప్రభావమో.. జన్యుపరమైన సమస్యలవల్లనో కొందరు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. అదే విధంగా జీవించాలని కోరుకుంటారు. ఇదంతా వ్యక్తిగత అనుకోవచ్చు. కానీ.. సామాజికంగా.. ఆరోగ్యపరంగా ఎదురయ్యే సవాళ్లతో వీటిని ఇప్పటి సమాజం ఆదరించేందుకు వెనుకా ముందు ఆడాల్సిన పరిస్థితి. ఇండియాలో.. ప్రపంచవ్యాప్తంగా కూడా గే కల్చర్ బాగా పెరిగింది. ఇదంతా స్వేచ్ఛగా భావించే వారు కొందరైతే.. పోర్న్ కల్చర్ కూడా దీనికి మరింత బలంగా మారింది. లెస్పినియన్స్, గే, బైలింగ్విల్ సెక్స్, వీరినే ఎంఎస్ ఎంగా కూడా అంటారు.. అంటే మెన్ సెక్స్‌టు మెన్ /ఉ మెన్. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్లు.. పబ్ లో పెళ్లి చేసుకున్నారు. ఇందులో కొత్తేమిటీ అంటే.. ఇద్దరూ మగాళ్లు కావటమే.. పైగా తాము గే అంటూ స్వయంగా ప్రకటించి.. ఫ్రెండ్స్‌కు మస్త్ పార్టీ కూడా ఇచ్చారు.
ఇప్పుడు అదే దారిలో గే జంట కోర్టును ఆశ్రయించింది. తాము పెళ్లిచేసుకున్నాం కాబట్టి.. జంటగా గుర్తించాలనేది వారి అభ్యర్థన. దీనికి చట్టపరంగానే కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా చూపుతున్నారు. ఇంతకీ వారెవరంటారా.. భారత్‌కు చెందిన అబ్బాయి.. మరొకరు విదేశీ కుర్రాడు. వీరిద్దరూ 2017లో వాషింగ్టన్‌లో పెళ్లి చేసుకున్నారట. 2020 మార్చిలో న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులెట్‌కు పెళ్లి రిజిస్ట్రేషన్‌కు అప్లై చేశారట. అక్కడ వారు తిరస్కరించటంతో ఆ ఇద్దరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమను ఆలుమగలుగా గుర్తించి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని చట్టాలను కూడా ఉదహరిస్తూ కోర్టును ఆశ్రయించటం సంచలనంగా మారింది. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ జరుపనుంది.



