జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందజలో ఉంది. బీజేపీ 25, టీఆర్ ఎస్ 12 వచ్చాయి. కీలకమైన డివిజన్లలో అంటే.. టీఆర్ ఎస్‌కు ప్రాభల్యం ఉన్న డివిజన్లలోనూ బీజేపీకు కలసిరావటం ఏదో జరగబోతుందనే సంకేతాలు పంపుతోంది. వాస్తవానికి బీజేపీ అనుకోకుండా వేగం అందుకుంది. దానికి తగినట్టుగా ఓటర్లు కూడా స్పందిస్తారనే అంచనాలు వేసుకున్నారు. 60శాతం ఓటింగ్ దాటినట్టయితే బీజేపీకు అవకాశాలు ఉండేవనే లెక్కలు లేకపోలేదు. కానీ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ ఎస్‌కే మేయర్ పీఠం అంటూ చెప్పేశాయి. 70 సీట్ల వరకూ టీఆర్ ఎస్ సాధించినా ఎక్స్ అఫిషియో ఓట్లతో తేలికగా నెగ్గుతారు. కానీ.. బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 4 సీట్లు సాధించింది. 2020 లో 4 సీట్లను మించి ఒక్కటి ఎక్కువ గెలుచుకున్నా అది తమ ఘనతగానే గాకుండా.. టీఆర్ ఎస్ వ్యతిరేకత పెరుగుతుందనే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లుతుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు.. బండి సంజయ్ దూకుడు.. అమిత్‌షా, యోగి ఆధిత్యనాథ్ ప్రచారానికి రావటంతో పార్టీలో జోష్ పెరిగింది. హిందువుల ఓట్లు దాదాపు కాషాయపార్టీకే అనేంతగా మారాయి. మారిన సమీకరణలు.. బీజేపీను బలమైన పార్టీగా.. టీఆర్ ఎస్‌కు అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా జనాల్లోకి తీసుకెళ్లనున్నారు. ఏమైనా.. బీజేపీ లెక్కలు అనుకూలించి జనం అవకాశం ఇస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందనే చెప్పాలి.